Vakeel Saab Pre release event: పవన్‌ను వకీల్ సాబ్‌గా.. దిల్ రాజుకు శతకోటి వందనాలు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుక కోసం క్రిష్ జాగర్లమూడి, ఏఎం రత్నం, సురేందర్ రెడ్డి, మైత్రీ మూవీస్ నిర్మాత రవికిషోర్, నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు సాగర్, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాలో నటించిన అంజలి, అనన్య నాగళ్ల, దర్శకుడు శ్రీరాం వేణు, నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ...

డీఐజీ సుమతికి సత్కారం
వకీల్ సాబ్ వేడుకలో కొందరు మహిళా ప్రముఖులను దిల్ రాజు, సినీ నటి అంజలి సత్కరించారు. తొలుత తెలంగాణ డీఐజీ సుమతిని సత్కరించారు. దిల్ రాజు బొకే అందించగా, అంజలి శాలువాతో సత్కరించారు. పింక్ చిత్రం కంటే ఎక్కువగా విజయాన్ని వకీల్ సాబ్‌కు అందించాలి అని ఈ సందర్భంగా సుమతి పేర్కొన్నారు.

మహిళలకు సమాన హక్కులు కల్పించాలి
పింక్ రీమేక్ చిత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనడం హ్యాపీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళా పోలీస్ అధికారి నన్ను పిలవడం ఆనందంగా ఉంది. ఎవరైనా ఓ స్త్రీని అమ్మగా ఊహించుకొన్నప్పుడు.. ఇలానే ఉండాలని అనుకోం. వివిధ రంగాల్లో ఉన్న యువతులు సాధించే విజయాలను గొప్పగా చూస్తాం. అలా కాకుండా మహిళలను మహిళగా చూడాలని అనుకొంటే నేను ఒప్పుకోను. మన చట్టాలు పురుషులే వారి కోసం రూపొందించుకొన్నారు. వాటిని మహిళలకు ఆపాదించేలా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొన్నారు అని డీఐజీ సుమతి అన్నారు.

పవన్ కల్యాణ్ ఫిలిం ఫెస్టివల్స్ ప్రారంభం
క్రిష్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా.. అని అన్నారు. హరిహర వీరమల్లు షూటింగు సందర్భంగా ట్విట్టర్ చూస్తూ నెటిజన్లు పెట్టిన కామెంట్లు ఆశ్చర్యం కలిగింది. ఎండ బాగా కొడుతున్నది మా హీరోను జాగ్రత్తగా చూసుకోండి అంటూ కామెంట్లు పెట్టారు. ప్రపంచ సినిమాలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ఫెస్టివల్ మొదలైంది. ఇలాంటి కథను పవన్ కల్యాణ్ వద్దకు తీసుకెళ్లినందుకు శతకోటి ధన్యవాదాలు అని అన్నారు.

వ్యక్తిగా పవన్ కల్యాణ్‌ను ఇష్టపడుతా
నిర్మాత ఏఏం రత్నం మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌తో నేను మూడు సినిమాలు రూపొందించాను. గతంలో ఖుషీ, బంగారం, తాజాగా హరిహర వీరమల్లు నిర్మిస్తున్నాను. పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటుడుగా కంటే ఆయన వ్యక్తిగతంగా ఇష్టం. ఎవరికైనా ఏదైనా అయితే తట్టుకోలేరు. ఖుషీ, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ రీమేక్స్ కానీ.. పవన్ కల్యాణ్ చేస్తే రీమేక్‌గా ఉండవు అని అన్నారు.

వకీల్ సాబ్ చిత్రంలో
నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు
రచయిత, డైరెక్టర్: శ్రీరాం వేణు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
సమర్పణ: బోనీ కపూర్
డీవోపీ: పీఎస్ వినోద్
మ్యూజిక్: థమన్ ఎస్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: థిరు
యాక్షన్: రవీ వర్మ
రిలీజ్ డేట్: 2021-04-09


Click it and Unblock the Notifications











