Vakeel Saab Pre release event: ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.. క్రిష్ కామెంట్స్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఉన్న హైప్, బజ్ గురించి ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఈక్రమంలో నేటి సాయంత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..

అభిమానుల సందడి..

అభిమానుల సందడి..

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈవెంట్ ఉంటుందా? లేదా? అని అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. కానీ చిట్టచివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద పవర్ స్టార్ అభిమానుల హడావిడి ఓ రేంజ్‌లో ఉంది.

ఫ్యాన్స్ వేరయా..

ఫ్యాన్స్ వేరయా..

ఇక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌లందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా. మొన్నోసారి షూటింగ్ చేస్తున్నాం. లంచ్ టైంలో అలా ట్విట్టర్ ఓపెన్ చేసిన నోటిఫికేషన్ చూస్తున్నాను. ఓ పది మంది మెసెజ్ పెట్టారు అని అన్నాడు.

వార్నింగ్ ఇచ్చారు..

వార్నింగ్ ఇచ్చారు..

ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది..మా పవన్ కళ్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. దానికి మొదటగా వకీల్ సాబ్ దిగ్విజయాన్ని ఆరంభిస్తోందని క్రిష్ అన్నాడు.

శతకోటి వందనాలు..

శతకోటి వందనాలు..

ఇలాంటి ఓ కథను, ఇతి వృత్తాన్ని పవన్ కళ్యాణ్‌ దగ్గరికి తీసుకెళ్లినందుకు దిల్ రాజు గారికి శతకోటి వందనాలు. తన కంటే ఓ మెట్టు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఉన్నా కూడా ఈ కథను అందరికీ చెప్పాలని అనుకున్నా పవన్ కళ్యాణ్ గ్రేట్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిస్తూ.. ఆకాంక్షిస్తున్నాని అంటూ క్రిష్ ప్రశంసలు కురిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X