పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త: ఆ ప్రాంతాల్లో స్పెషల్ షోలకు ప్లాన్.. టికెట్ రేటు మాత్రం భారీగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలి యాక్టింగ్‌, స్టైల్స్‌తో చాలా కాలంగా అలరిస్తూ.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం వల్లే అతడు ఈ రేంజ్‌లో వెలుగొందుతున్నాడు. అలాంటిది చాలా కాలం తర్వాత 'వకీల్ సాబ్' ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంటే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

 ‘వకీల్ సాబ్'గా మారి రీఎంట్రీ ఇస్తున్న పవన్

‘వకీల్ సాబ్'గా మారి రీఎంట్రీ ఇస్తున్న పవన్

దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. రీఎంట్రీ అంటే కొత్త కథతో వచ్చే పరిస్థితులు ఉన్నా.. పాత సినిమాను రీమేక్ చేస్తున్నాడు పవన్.

సినిమా నేపథ్యం ఇదే.. ఆ ముగ్గురే హైలైట్‌గా

సినిమా నేపథ్యం ఇదే.. ఆ ముగ్గురే హైలైట్‌గా

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేని ముగ్గురు సామాన్య యువతులకు అనుకోని విధంగా ఓ కష్టం వస్తుంది. ఇందులో భాగంగానే వాళ్లంతా ఓ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లకు ప్రతికూలంగా మారుతోన్న టైమ్‌లో లాయరైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి బాధిత యువతలను కాపాడేందుకు పోరాటం చేస్తాడు. ఇదే వకీల్ సాబ్ కథ. అంజలి, నివేదా థామస్, అనన్య ఆ మూడు పాత్రలను చేశారు.

 పవన్ స్థాయికి తగ్గట్లే మార్పులు.. భారీగానే

పవన్ స్థాయికి తగ్గట్లే మార్పులు.. భారీగానే

'వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. రెండు భాషల్లో లేని విధంగా ఇందులో పవన్ కల్యాణ్‌ పాత్రను ఎలివేట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మోషన్ పోస్టర్, టీజర్‌, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపయ్యాయి. ఇక, ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచింది.

 బిజినెస్ ఊహించని విధంగా.. గ్రాండ్‌గా రిలీజ్‌

బిజినెస్ ఊహించని విధంగా.. గ్రాండ్‌గా రిలీజ్‌


లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

అప్పుడే ఫుల్.. ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

అప్పుడే ఫుల్.. ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో.. 'వకీల్ సాబ్'కు అంతకు మించిన స్పందన వస్తోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ లైన్స్ ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. హైదరాబాద్‌లోనైతే ఏకంగా 110 షోలకు గానూ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త వచ్చింది.

ఆ ప్రాంతాల్లో స్పెషల్ షోలకు ప్లాన్.. టికెట్ రేటు

ఆ ప్రాంతాల్లో స్పెషల్ షోలకు ప్లాన్.. టికెట్ రేటు

తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ముందు రోజు అర్ధరాత్రి 'వకీల్ సాబ్' మూవీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు థియేటర్ యజమానులు. ఒకవేళ ప్రభుత్వ అనుమతి లభించకపోతే ఏప్రిల్ 9న ఉదయం 7 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తారని టాక్. దీని టికెట్ రేటు సుమారు రూ. 2000 ఉంటుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X