Vakeel Saab twitter review.. బొమ్మ బ్లాక్ బస్టర్.. పవన్ మ్యాజిక్‌కు స్టాండింగ్ ఓవేషన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యూఎస్‌లో గురువారం రాత్రి జరిగిన ప్రీమియర్స్ తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకొన్న ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. తొలి ఆట తర్వాత అభిమానులు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే...
Fans ki ayithey matram next level , power ⭐️ rocked , court scenes Ayithey 🔥, fights are next level, vintage Kalyan babu you guys will see #VenuSriram narrated story very well MusicThaman 🔥 songs and bgm extraordinary #VakeelSaab
— Rawm vlogs (ursmrk) April 8, 2021
Enjoy in theatres
signing off
నెక్ట్స్ లెవెల్ అంటూ
వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే ఫ్యాన్స్‌కి నెక్ట్స్ లెవెల్. పవర్‌ఫుల్, కోర్టు సీన్లలో దుమ్మురేపాడు. ఫైట్స్ మరో లెవెల్‌లో ఉన్నాయి. వేణు శ్రీరాం సినిమా కథను అద్భుతంగా తెరకెక్కించాడు. థమన్ మ్యూజిక్, బీజీఎం ఎక్ట్రార్డినరీ. థియేటర్లలో ఫుల్లుగా ఎంజాయ్ చేశాను.
కెరీర్‌లోనే బెస్ట్.. గ్రాండ్‌గా స్క్రీన్ ప్రజెన్స్
వకీల్ సాబ్‌గా పవన్ కల్యాణ్ సార్ తనదైన శైలిలో కనిపించారు. సినిమాను కంప్లీట్‌గా ఓన్ చేసుకొన్నాడు. పవర్ స్టార్ కెరీర్‌లోనే బెస్ట్. కోర్టు రూమ్ సీన్లలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గ్రాండ్‌గా ఉంది. బీజీఎం నెక్ట్స్ లెవెల్ హిట్ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ మ్యాజిక్
వకీల్ సాబ్ తొలి గంటలో మ్యాజిక్ కనిపించింది. పవన్ కల్యాణ్‌కు ఇంతకంటే గొప్ప కమ్ బ్యాక్ మూవీ లభించదు. సినిమా చూసిన తర్వాత మాటలు రావడం లేదు. ఇంట్రో సీన్స్ చూస్తే రోమాలు నిక్కబోడిచాయి అంటూ మరో నెటిజన్ పోస్టు చేశాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్
వకీల్ సాబ్ ఫస్ట్ హాఫ్ ఫినీష్ అయింది. గత కొద్ది సంవత్సరాలుగా పవన్ కల్యాణ్‌ను ఎంత మిస్ అయ్యామో అనే విషయం వకీల్ సాబ్ చూస్తే తెలుస్తుంది. వేణు శ్రీరాం తీసిన విధానం చూస్తే ఆయన రేంజ్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టం. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా కమర్షియల్ ఎలిమింట్స్ అద్బుతంగా చెప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కేవలం ఫ్యాన్స్ ప్రత్యేకం అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.
కోర్టు సీన్లు అద్భుతంగా
సెకండాఫ్ బ్లాక్ బస్టర్‌గా ఉంది. కోర్టు సీన్లు అద్భుతంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్. సెకండాఫ్‌ను బాగా ఎంజాయ్ చేశాను. వన్ లైనర్ డైలాగ్స్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్ని బాగా ఉన్నాయి. పీకే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంది. ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఒక్కడే
వెండితెర మీద అర్జున్ రెడ్డి, బాహుబలి వచ్చి పోతుంటారు. కానీ పవన్ కల్యాణ్ ఒక్కడే దక్షిణాదిలో బిగ్గెస్ట్ స్టార్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Recommended Video
స్టాండింగ్ ఓవేషన్ మూవీ
వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వకుండా ఉండలేరు. పవన్ కల్యాణ్ యాక్టింగ్, సినిమా బ్రిల్లియెంట్. కేవలం ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్ తమ ఫ్యామిలీతో కలిసి వెళ్లాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో పవన్ అభిమానులకు ఫర్‌ఫెక్ట్ మూవీ. వేణు శ్రీరాం కథను, పవన్ కల్యాణ్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు అద్బుతం అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











