twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ పవర్ స్టార్, తట్టుకోలేకపోయిన అన్నయ్య (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తాను కేవలం సినిమా పవర్ స్టార్‌ను కాదు....రియల్ పవర్ స్టార్ అని నిరూపించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ స్థాపించినప్పటికీ పోటీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్....కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా టీడీపీ-బీజేపీ కూటిమి మద్దతుగా నిలిచి విజయవంతం అయ్యారు.

    మరో వైపు పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలు భుజానేసుకుని ఘోరంగా విఫలం అయ్యారు. తమ్ముడి జోరుకు అన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో సింగిల్ సీటు కూడా గెలుచుకోలేక పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    పవన్ కళ్యాణ్ విక్టరీతో చిరంజీవికి పెద్ద ఎదురు దెబ్బతగిలిందని చెప్పక తప్పదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామనే కలతో 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి పార్టీని విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలం అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం ద్వారా తన రాజకీయ కలను నెరవేర్చుకోవాలనుకున్నారు మెగాస్టార్.

    విలీనం తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి....ఒక వేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. అయితే అన్నయ్య అవకాశాలకు తమ్ముడు పూర్తిగా గడికొట్టారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    పవన్ కళ్యాణ్ విక్టరీపై పలువురు సినీతారల స్పందన స్లైడ్ షోలో....

    రాజమౌళి

    రాజమౌళి


    పవన్ కళ్యాణ్ ప్రచారం టీడీపీ, బీజేపీ కూటమికి బాగా కలిసొచ్చిందని దర్శకుడు రాజమౌళి అభిప్రాయ పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్టీఏకు మద్దతు ఇవ్వడం అనే అంశం చరిత్రలో నిలిచి పోతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

    థాంక్స్ చెప్పిన మోడీ

    థాంక్స్ చెప్పిన మోడీ


    తన గెలుపుకు సహకరించిన పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మోడీ. తనను గుర్తుంచుకుని థాంక్స్ చెప్పిన మోడీకి కూడా పవన్ మళ్లీ థాంక్స్ చెప్పారు. మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని నమ్ముతున్నట్లు పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు.

    చంద్ర బాబు థాంక్స్ చెప్పారు

    చంద్ర బాబు థాంక్స్ చెప్పారు


    ఎన్నికల్లో గెలుపుకు సహకారం అందించిన పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు.

    మధుర శ్రీధర్

    మధుర శ్రీధర్


    కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ నినాదంతో ఎన్నికల్లో ముందుకు సాగిన పవన్ కళ్యాణ్‌కు దర్శకుడు మధుర శ్రీధర్ థాంక్స్ చెప్పారు.

    నిఖిల్

    నిఖిల్


    మెడీ సునామీ ఇంతగా రావడానికి మన ఆరు అడుగుల బుల్లెట్ సహకారం అందించారంటూ నిఖిల్ పేర్కొన్నారు.

    కోన వెంకట్

    కోన వెంకట్


    టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవడానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్‌కు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు.

    English summary
    
 Power Star Pawan Kalyan has proved his fame as a superstar, while his more popular elder brother Chiranjeevi turned a zero in the simultaneous polls to Andhra Pradesh assembly and Lok Sabha. If 2009 elections saw the Megastar's Praja Rajyam Party (PRP) proving a big flop, this time the Congress party under his leadership failed to win even a single MLA or MP seat in Seemandhra or the residuary state of Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X