»   » శ్రీజ వివాహంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య (ఫోటోస్, వీడియో)

శ్రీజ వివాహంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య (ఫోటోస్, వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం ఇటీవల గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకతో దాదాపు వారం రోజుల పాటు మెగా ఫ్యామిలీ అంతా పండగ వాతావరణం నెలకొంది. మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అందరూ ఈ వేడుకకు హాజరైన సందడి చేసారు.

శ్రీజ వివాహంలో అంతా బాగానే జరిగింది కానీ.... ఒకే ఒక్క చిన్న లోటు కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ మెగా వెడ్డింగుకు పవన్ కళ్యాణ్ హాజరు కాక పోవడమే. శ్రీజ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలా విడుదలయ్యాయి. అందులో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూసారు.

Also Read: శ్రీజ-కల్యాణ్‌ల రిసెప్షన్‌: వాళ్లంతా వచ్చారు,ఫుల్ హ్యాపీ (ఫొటోలు)

తన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్... శ్రీజ వివాహానికి డుమ్మా కొట్టేసి సర్దార్ స్విట్జర్లాండ్ షూటింగుకు వెళ్లి పోయారు. అయితే తాను లేక పోయినా.... ఆ లోటును ఎంతో కొంత పూడ్చాలనే ఉద్దేశ్యంతో తన భార్య ఈ వేడుకకు హాజరయ్యేలా ప్లాన్ చేసారు పవన్ కళ్యాణ్.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ విదేశీ మహిళను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పేరు అన్న లెజెనివా. అప్పట్లో వీరి పెళ్లి విషయంలో తెలుగునాట సంచలనం. ఈ సంగతి పక్కన పెడితే... అన్నా లెజెనివా శ్రీజ వివాహంలో పాల్గొన్న ఫోటోలు ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత అన్నా లెజెనివా ఫోటోల్లో కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు...

శ్రీజ పెళ్లి వేడుకలో...

శ్రీజ పెళ్లి వేడుకలో...

శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా. మెగా ఫ్యామిలీలో ఆమె బాగా కలిసిపోయారు.

ఇలాంటి వేడుకలో తొలిసారి

ఇలాంటి వేడుకలో తొలిసారి

అన్నా లెజెనివా విదేశీ వనిత కావడంతో...ఆమెకు మన సాంప్రదాయాలు కొత్త. ఎంతో ఆసక్తిగా ఆమె ఇందులో పాల్గొన్నారు.

వీడియో..

శ్రీజ వివాహానికి సంబంధించిన ఫుల్ వెడ్డింగ్ వీడియో...

పవన్, అన్నా లెజెనివా

పవన్, అన్నా లెజెనివా

పవన్ కళ్యాణ్, అన్నా లెజెనివా ఓల్డ్ ఫోటో...

English summary
Pawan Kalyan’s third wife Anna Lezhneva was appeared in Srija’s wedding celebrations and she was appeared in a complete Indian culture avatar wearing Sareee.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu