Bro: మెగా అభిమానులకు సర్ప్రైజ్.. 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా పేరు సాధించుకున్నాడు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్.. తన చిన్నమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబందించిన ఓ క్రేజీ అప్డేట్ అభిమానులను సంతోషపెట్టనుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం బ్రో. దీనికి మరో సహా నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలి కాంబినేషన్ అయిన ఈ మూవీని సముద్ర ఖని డైరెక్ట్ చేయగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఇక ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో హాట్ బ్యూటి కేతిక శర్మ, వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న బ్రో చిత్రం.. వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ ఆ అంచనాలను మరింత పెంచాయి. అయితే బ్రో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విడుదలకు మూడు రోజుల ముందు అంటే జూలై 25న నిర్వహించనున్నారని ప్రస్తుతం ఉన్న సమాచారం. అందుకు హైదరాబాద్ లోని శిల్పాకళా స్టేజ్ వేదిక కానుంది. బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శిల్పాకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారని టాక్. అయితే ఈ ఈవెంట్ ను రాజమహేంద్రవరంలో నిర్వహిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ ప్లేస్ మారిందని టాక్. అంతేకాకుండా ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారని కూడా ఓ టాక్ అయితే నడుస్తోంది.


Click it and Unblock the Notifications











