Official: Bro Trailer వచ్చేస్తోంది బ్రో.. ఎప్పుడు విడుదల అంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. రేయ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన దానికంటే ముందు పిల్లా నువ్వు లేని జీవితం మూవీ విడుదలైంది. అప్పటి నుంచి తనదైన యాక్టింగ్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల విరూపాక్షతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మామతో కలిసి బ్రో (Bro Movie) మూవీతో రానున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చి అభిమానులను సంతోషపెట్టారు మేకర్స్.
టాలీవుడ్ చిత్ర పరిశ్మలో ఇటీవల మంచి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దీని బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా సినిమానే బ్రో. దీనికి మరో సహా నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరించగా.. సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలను టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మామ అల్లుళ్లు అయినా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న బ్రో.. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం సాయి ధరమ్, పవన్ కల్యాణ్ పోస్టర్స్, గెటప్పులు, సాంగ్స్. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు వహించిగా.. మై డియర్ మార్కండేయ, జాణవులే పాటలకు రెస్ఫాన్స్ బాగానే ఉంది.
ఇక బ్రో సినిమాను జూలై 28న ప్రేక్షకుల ముందుకు వరల్డ్ వైడ్ గా తీసుకురానున్నారు. అయితే ఇప్పటివరకు ట్రైలర్ మాత్రం రిలీజ్ కాలేదు. తాజాగా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. బ్రో మూవీ ట్రైలర్ ను జూలై 21న అంటే శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ సమయం అనేది మాత్రం తెలియదు. ఇదిలా ఉంటే బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ ను జూలై 25న హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం.
కాగా బ్రో సినిమాలో హాట్ బ్యూటి కేతిక శర్మ, వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉన్నారనే తెలియడంతోనే సినిమాకు ఓకే చెప్పినట్లుగా రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.


Click it and Unblock the Notifications











