హాట్ న్యూస్ : మాస్ మసాలా చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ త్వరలో పక్కా మాస్ మసాలా చిత్రంలో కనిపించనున్నారు. ఈ మేరకు స్క్రిప్టు పూర్తై షూటింగ్ కి రంగం సిద్దమైంది. రామ్ చరణ్ తో 'రచ్చ' చిత్రం రూపొందించిన సంపత్ నందికి పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చార. మే రెండవ వారం నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి సంపత్ తాజాగా పూర్తి స్క్రిప్టుని నేరేట్ చేసారని, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇక ఈ చిత్రానికి సంభందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాజల్ హీరోయిన్ గా చేసే అవకాసం ఉంది. త్వరలోనే అథికారికంగా ప్రకటించే అవకాసం ఉంది. 'రచ్చ' లాగానే పక్కా కమర్షియల్ స్టోరీ ఐడియాతో పవన్ ని సంప్రదించాడని,గబ్బర్ సింగ్ తరహా హిట్ అవుతుందని నమ్మి స్కిప్టు ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. పదిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ ప్రారంభమైందని, సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు.

అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి. పవన్ సైతం యువ దర్శకులను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలోనే హరీష్ శంకర్ ని,సంపత్ నంది తో ఓకే చేసాడని,పవన్ ఫ్యాన్స్ కు పండగ అయ్యేలా డైలాగులు,సీన్లతో మరో వెర్షన్ రాసుకొస్తానని సంపత్...పవన్ కి మాట ఇచ్చాడని అంటున్నారు.

చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరద్ మరార్ పమంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది. . దీంతో ఓ మంచి కథ వెతికే ప్రయత్నంలో శరత్ ఉన్నాడు. శరద్ మరార్ గతంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసారు. ఆయన కెరీర్ ..అమితాబ్ కు చెందిన ఎబిసిఎల్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ గా మొదలెట్టారు.

మరో ప్రక్క శరత్ మరార్...చిత్ర సీమ అనే కొత్త ఛానెల్ ని NTV ఆధ్వర్యంలో మొదలు పెట్టానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యులైన కొందరు నిర్మాతలు ఈ ఛానెల్ లో భాగస్వాములుగా ఉండి మరీ ఈ ఛానెల్ ని తెస్తున్నారని తెలుస్తోంది. శరద్ మరార్ గతంలో మాటీవిలోనూ మంచి రేటింగ్స్ తెచ్చారని, ఇప్పుడు ఈ కొత్త తెలుగు సినీ ఛానెల్ ను కూడా ఆయన నిలబడతారని భావిస్తున్నారు. ఇక శరద్ మరార్ కి మొదటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి. పవన్ స్నేహితుడుగానే కాకుండా ఆయన పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X