పోరా పోయి పని చూసుకో.. ఆ హీరోయిన్ గురించి అలా అనడంతో బండ్లపై పవన్ సెటైర్
తెలుగు సినీ చరిత్రలో, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో, బండ్ల గణేష్ జీవితంలో, శ్రుతీ హాసన్ లైఫ్ టర్నింగ్‌లో గబ్బర్ సింగ్ పాత్ర ఎంతో గొప్పది. పుష్కర కాలం పాటు హిట్ అన్నది లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్‌కు అతని అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. తీన్‌మార్ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి బోల్తా పడ్డ బండ్ల గణేష్‌ను గబ్బర్ సింగ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా చేసింది. ఇక ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న శ్రుతీ హాసన్‌కు గబ్బర్ సింగ్‌తో గోల్డెన్ హ్యాండ్‌గా అన్న ట్యాగ్‌ను సంపాదించుకుంది. అయితే వీటి వెనుక చాల పెద్ద కథే ఉంది.

గబ్బర్ సింగ్ అలా మొదలు..
మొదటగా దబంగ్ సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ కాపీ రైట్స్ కొన్నాడు. తానే ఈ చిత్రాన్ని నిర్మించాలని మొదట భావించాడట. అయితే పవన్ కళ్యాణ్ అనూహ్యంగా.. బండ్ల గణేష్‌ను పిలిచి ఈ సినిమా కూడా నువ్వే చేసుకుపోరా అంటూ అదృష్టాన్ని కల్పించాడట. ఇక ఈ చిత్రం నిర్మాతగా బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టింది.

రికార్డులు బద్దలు..
గబ్బర్ సింగ్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ నిరాశ పరచగా.. ఆ కసంతా గబ్బర్ సింగ్‌పై చూపించారు. రికార్డ్ కలెక్షన్లతో గబ్బర్ సింగ్ ఓ చరిత్ర సృష్టించింది. ఇక సినిమా అంతా ఒకెత్తు అయితే పాటలు మరో ఎత్తు. అయితే ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కనిపించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఐరెన్ లెగ్ అంటూ..
శ్రుతీ హాసన్ తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది దారుణంగా బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఆపై వచ్చిన 7th సెన్స్, ఓ మై ఫ్రెండ్ ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూట గట్టుకున్నాయి. దీంతో శ్రుతీ హాసన్ ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది.
Recommended Video

అలా అన్నాడట..
గబ్బర్ సింగ్‌లో శ్రుతీ హాసన్‌ను తీసుకోవడంపై బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌తో చర్చించాడట. బాబు ఈ అమ్మాయి మనకు వద్దు.. అని బండ్లన్న అంటే.. ఏరా ఎందుకు అని పవన్ అడిగాడట. ఈ అమ్మాయి ఫ్లాపుల్లో ఉంది అందుకే వద్దనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడట. వెంటనే పవన్ కళ్యాణ్.. నువ్ ఏమైనా అన్ని సూపర్ హిట్స్ తీశావారా? అని అనడంతో నోరు మూసుకున్నాడట. పోరా పోయ్ పని చూసుకో అని పవన్ ఫన్నీగా అన్నాడట.


Click it and Unblock the Notifications











