twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాంసం కోసం చంపే పశువుల సంగతేమిటి?? జల్లికట్టుపై స్పందించిన పవన్

    జల్లికట్టు, కోడిపందాల నిషేధంపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్‌లో ఘాటుగా స్పందించి, కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

    |

    జల్లికట్టు, కోడిపందాల నిషేధంపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించారు.త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన వేళ ఆ అంశంతో పాటు కోడిపందేలపై కూడా జ‌న‌సేనాని, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్‌లో ఘాటుగా స్పందించి, కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

    జల్లికట్టు, కోడిపందాలకు మద్దతు తెలిపుతున్నట్టు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. జల్లికట్టుపై నిషేధం ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా అభివర్ణించారు. దక్షిణ భారతంపై కేంద్ర వైఖరికి ఇది నిదర్శనమని పవన్‌ అన్నారు. సంస్కృతి, పశువులు, మాతృభూమిపై తనకు గౌరవం ఉందని, గోవామృతంతో తాను వ్యవసాయం చేస్తున్నానని, తన గోశాలలో 16 ఆవులు ఉన్నాయని పవన్‌కల్యాణ్ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. నిషేధాన్ని పవిత్ర కార్యంగా భావిస్తే మరి గొడ్డు మాంసం సంగతేంటని పవన్ ప్రశ్నించారు.

    Pawan Kalyan says ban an attack on Dravidian culture

    ఎద్దుల బండిపై కూర్చోని తన ఫాం హౌస్‌లో దిగిన ఫోటోను పవన్ ముందుగా ట్వీట్ చేశాడు. తన గోశాలలో 16కు పైగా ఆవులు, దూడలు ఉన్నాయని తెలిపాడు పవన్. తన ఫాంలో ఉన్న ఆవులు, కోడిపుంజులు.. దక్షిణాభారతంలో జల్లికట్టు, కోడిపందేలపై విధించిన నిషేధం గురించి తనను ఆలోచింప చేస్తున్నాయని కామెంట్ చేశాడు.

    Pawan Kalyan says ban an attack on Dravidian culture

    పవన్‌తో పాటు మహేష్ బాబు, అఖిల్ అక్కినేని లాంటి తెలుగు హీరోలు తమిళ నాట జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలిపారు. జల్లికట్టుకు మద్దతు ప్రకటిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జల్లికట్టుపై నిషేధం అనేది ద్రవిడ సంసృతికి వ్యతిరేకం అని... దక్షిణ హిందూస్తాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుడని... పవన్‌ వివరించారు.భారతదేశంలో ఆవులు, గేదెల మాంసం కోసం ఎన్ని మూగ జీవులు చంపబడ్తున్నాయి అని అడిగారు. పశువులను చంపి దాదాపుగా 2.4 మిలియన్ టన్నుల బీఫ్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఇదేంటి జంతువులను హింసించడం కదా.. జల్లికట్టు విషయంలోనే జంతు హింస గుర్తొచ్చిందా... అని కేంద్రాన్ని అడిగాడు.

    English summary
    "Looking at the roosters and cows in my farm made by think about the ban on Jallikattu and Kodipandem in Dakshin Bharat," the actor Pawan Kalyan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X