సల్మాన్ సినిమాకు నో చెప్పిన పవన్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన 'దబాంగ్' చిత్రానికి రీమేక్ పవర్ స్టార్ చేసిన 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ లో పవన్ కి సరిపోయే ఏ హిట్ సినిమా వచ్చినా నిర్మాతలు ఆ దిశగా రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల సల్మాన్ హీరోగా వచ్చిన 'ఏక్ థా టైగర్' చిత్రం రికార్డు స్థాయిలోకలెక్షన్లు కురిపించిన నేపథ్యంలో కొందరు నిర్మాతలు ఈ చిత్రానికి రీమేక్ చేద్దాం అంటూ ఆయన్ను సంప్రదించగా....నో చెప్పాడట. అంతే కాదు కొన్ని రోజుల వరకు రీమేక్ చిత్రాలు చేయదలుచుకోలేదని తెగుసి చెప్పాడట. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్లి పోయారు సదరు నిర్మాతలు.
పవన్ నిర్ణయం చూస్తుంటే....రీమేకులకు 'గబ్బర్ సింగ్' చిత్రంతోనే బ్రేక్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. వరుసగా రీమేకులు చేసుకుంటూ పోతే రీమేకుల హీరోగా ముద్ర పడే అవకాశం ఉన్నందున పవర్ స్టార్ ఇలా డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11న ఈచిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











