ట్వీటడం ఇష్టం లేదని తెగేసి చెప్పిన పవన్

By Bojja Kumar

హాలీవుడ్, బాలీవుడ్ హీరోల దగ్గర నుంచి...టాలీవుడ్ హీరోలకు వరకు ట్విట్టర్ అకౌంట్లు తెరిచి అభిమానులకు టచ్ లో ఉంటూ వారిని ఉత్సాహ పరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ తెరవలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తే తనదైన రీతిలో స్పందించారు. తనకు ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేరడం ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. అభిమానులతో ట్విట్టర్ ద్వారానే అభిప్రాయాలను షేర్ చేసుకోవాల్సిన పని లేదు, అవసరం అయినప్పుడు నేనే అభిమానుల ముందుకు వచ్చి ఏ విషయాన్నయినా నిక్కచ్చిగా మాట్లాడుతా అనే విధంగా సమాధానం ఇచ్చారు పవన్.

నేను షూటింగ్ నుంచి తిరిగి వచ్చాను, ఈ రోజు ఖాళీగా ఉండి రిలాక్స్ అవుతున్నాను అంటూ తమ ట్విట్టర్లలో ఇతర హీరోలు, హీరోయిన్లు.... పేర్కొనడాన్ని సొల్లు కబుర్లుగా పవన్ భావిస్తున్నారని ఆయన మాటల్లో ప్రస్పుటం అయింది. ఈ ఇంటర్వూలో పవన్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...జానీ సినిమా దర్శకుడు నన్ను మోసం చేశాడు. ఆ సినిమా నన్ను బాగా నిరాశ పరిచింది అని పేర్కొనడం. జానీ సినిమాకు దర్శకత్వం వహించింది పవన్ కళ్యాణే కావడం, ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కావాలనే ఇలాంటి ఫన్నీ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చుంది.

ఇక పోతే పవన్ కళ్యాణ్ పంజా సినిమా డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. చాలా కాలంగా సరైన హిట్ లేని పవన్ 'పంజా"సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజే ఈ సినిమా సెన్సార్ బోర్డు పరిశీలనకు వెళ్లింది. మరి సెన్సార్ రిపోర్టు ఎలా వస్తుందో? ఏమో? అనే టెన్సన్ సినీ దర్శక నిర్మాతల్లో నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X