త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో నన్ను పార్లమెంట్‌కు పోటీ చేయాలని, మరికొందరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని అభ్యర్థిస్తున్నారు. 2014లోనే అసెంబ్లీకి పోటీ చేయాలని కోరారు. కానీ టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల అది కుదర్లేదు అని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
గ్రాఫిక్స్ మనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీకి గ్రాఫిక్స్ సభల్లో అవసరం. సినిమాలో కూడా నేను గ్రాఫిక్స్ వాడను. ఎందుకంటే.. ఈజీగా దొరికిపోతామని వాడను. 15 లక్షల జనం వచ్చారంటే ఎలా నమ్ముతాం. 5, 6 లక్షల జనం వస్తేనే చాలా ఎక్కువ. అలాంటి 15 లక్షల మంది వచ్చారంటే నమ్ముతారా? వాళ్లకు గ్రాఫిక్స్ ఉన్నాయనే నమ్మకంతో అలా చెప్పారు. బ్రో సినిమాలో గ్రాఫిక్స్ బాగాలేకపోతేనే నన్ను తిట్టారు. పాపం జగన్‌కు గ్రాఫిక్స్ మీద అవగాహన లేక బోర్లా పడ్డారు అని పవన్ కల్యాణ్ చెప్పారు.

పార్టీని ఎలా నడుపాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు వెన్నంటి నిలిచిన నా స్నేహితుడు, సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. నేను సమాజం కోసం ఆలోచిస్తే.. నా కోసం ఒకడు ఆలోచించే వాడు ఉండాలి కదా. నా కోసం వకీల్ సాబ్, మూడు, నాలుగు సినిమాలు చేశాం. నా కోసం నాలుగైదు సినిమాలకు స్క్రిప్టు రాశారు అని పవన్ కల్యాణ్ చెప్పారు.
నేను రాజకీయాల్లోకి వెళ్లడం త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అసలు ఇష్టం లేదు. కానీ నా వ్యధ భరించలేక.. .జల్సా సినిమాలో ఇంటర్వెల్ సీన్ రాశారు. ఆ సీన్ సగటు మనిషి ఆవేదన. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఉద్యమంలోకి వెళ్లాలని అనుకొనే వాడిని. ఆ కోపం అలా ఉండిపోయింది. నా కోపాన్ని చూసి సినిమాలో అలాంటి డైలాగ్స్ రాశారు. అప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండాలని అనుకొన్నాడు. కానీ ఆ తర్వాత నేను పేట్రేగి పోయాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

తన కార్యకర్తలు, సోషల్ మీడియా వర్కర్లతో మాట్లాడుతూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రస్తావించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీపాద శ్రీవల్లభుడి జన్మించిన పవిత్ర స్థలం నుంచి పోటీ చేస్తానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. దాంతో అభిమానులు, శ్రేయోభిలాషులు స్వాగతించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును విజయం సాధించేలా కష్టపడాలని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications











