ఇతడే మా నిమ్మల వీరన్న అంటూ... సెల్ఫీ పోస్టు చేసిన పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ సెల్పీ పిక్ హాట్ టాపిక్ అయింది. తన జనసేన పార్టీ కార్యకర్త నిమ్మల వీరన్న గురించి చెబుతూ ఆయన ఈ సెల్ఫీ పిక్ పోస్టు చేశారు.
సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తే అభిమానులు, పార్టీ కార్యకర్తలు సెల్పీ దిగడానికి ఆసక్తి చూపుతాడు. అయితే ఓ కార్యకర్తతో స్వయంగా పవన్ కళ్యాణే సెల్ఫీ దిగడం చర్చనీయాంశం అయింది.
Recommended Video

కేవలం అతడితో సెల్ఫీ దిగడం మాత్రమే కాదు.... అతడి పేరు, అతడి ప్రత్యేకత గురించిన వివరాలు కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో మెన్షన్ చేశారు. ఈ సెల్ఫీ పిక్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయింది.

ఇతడే మా నిమ్మల వీరన్న అంటూ..
‘సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం నిరంతరం పనిచేసే, అలుపెరుగని కార్యకర్త మా నిమ్మల వీరన్నతో..' అంటూ పవన్ కళ్యాణ్ సెల్ఫీ పిక్ పోస్టు చేశారు.

వీరన్న దారిలో మరింత మంది
నిమ్మల వీరన్న దారిలో ప్రయాణించి, నిజాయితీగల కార్యకర్తగా పేరు తెచ్చుకునేందుకు, పవన్ కళ్యాణ్ మెప్పు పొందేందుకు మరింత మంది కార్యకర్తలు అడుగులు వేస్తున్నారు.

సినిమాలతో పాటు పాలిటిక్స్
ఇటు సినిమాలు చేస్తూనే మరో వైపు తాను స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయానికి జనసేన సైన్యం భారీగా తయారయ్యే అవకాశం ఉంది.

పవన్-త్రివిక్రమ్ మూవీ
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే పవన్ కళ్యాన్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో జిజీ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications