»   » ఎన్ఆర్ ఫ్యాన్స్‌కి గిఫ్టు పంపిన పవన్ కళ్యాణ్, ఏంటో తెలుసా?

ఎన్ఆర్ ఫ్యాన్స్‌కి గిఫ్టు పంపిన పవన్ కళ్యాణ్, ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ప్రతి వేసవిలో ఆయన సన్నిహితులకు మామిడి పండ్లు గిఫ్టుగా వెళతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ కి ఓ ప్రత్యేకమైన బహుమతి పంపారు.

పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ అభిమానులకు 'ఆధునిక మహాభారతం' పుస్తకాన్ని మెయిల్ ద్వారా పంపారు. ఇటీవల పవర్ స్టార్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన సదస్సుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అభిమానులు తమకు గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం కావాలని అడిగారట.

ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవలే రీ ప్రింట్ చేయించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌ ఎందుకు రీ ప్రింట్ చేయించారు?

పవన్ కళ్యాణ్‌ ఎందుకు రీ ప్రింట్ చేయించారు?

పుస్త‌కం గురించి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాన్ని చదివారు. ఈ పుస్తకం చదివిని తర్వాత ఆయనకు ఎంతో నచ్చింది. ఇంత మంచి పుస్తకం ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో లేక‌పోవ‌డంతో నేటి యువ‌త‌కు ఈ మ‌హా గ్రంధం అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని భావించి ప‌వ‌న్ త‌న ఖ‌ర్చుల‌తో ఈ పుస్త‌కాన్ని ప్రింట్ చేయించారు.

ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు...

ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు...

ఆ మధ్య ఈ పుస్తకం గురించి పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా స్పందిస్తూ..."ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు", అన్న 'మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. 'నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?' అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు 'మహావాక్యం' అయింది అన్నారు.

దేశ, సమాజ శ్రేయస్సు కోసం

దేశ, సమాజ శ్రేయస్సు కోసం

ఆధునిక మహాభారతం' అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాన్ భావించారు. అందుకే ఈ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించారు.

పుస్తకంలో ఏముంది?

పుస్తకంలో ఏముంది?

ఈ ఆధునిక మహాభారతం ...1970 నుంచి 1986 మధ్యకాలంలో ప్రచురించిన గుంటూరు శేషేంధ్ర శర్మ వచన కవితా సంకలనాల సమాహారం. 1984 వరకూ వెలుబడ్డ ఆ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. మార్కెట్లో ఈ పుస్తకాలు లేక పోవడంతో పవన్ కళ్యాణ్ దాదాపు 25000 కాపీలు ప్రింట్ చేయించారు.

English summary
Pawan has mailed the book of "Adhunika Mahabharatam" to his NRI fans who have rallied for him at Nashivlle through their cars during his recent visit to USA on the eve of Harvard University Indian Summit 2017. He has sent this book written by Gunturu Seshendra Sharma with an autograph of him.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu