»   » ఫ్యాన్స్ గుండె గుభేల్: సినిమాల మీద పవన్ కళ్యాణ్ సెన్సేషన్ కామెంట్ (వీడియో)

ఫ్యాన్స్ గుండె గుభేల్: సినిమాల మీద పవన్ కళ్యాణ్ సెన్సేషన్ కామెంట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఫ్యాన్స్ గుండె గుభేల్.. సినిమాలకు పవన్ గుడ్ బై..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇకపై ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? అనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ అయోమయానికి కారణం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సినిమాల్లో కంటిన్యూ అవుతాననే విషయంలో ఓ స్పష్టమైన ప్రకటన ఇవ్వక పోవడమే. అయితే తాజాగా పవర్ స్టార్ తన సినిమా కెరీర్ విషయమై స్పష్టమైన ప్రకటన చేశారు.

అజ్ఞాతవాసి చివరి సినిమా

అజ్ఞాతవాసి చివరి సినిమా

‘అజ్జాతవాసి' పవన్ కళ్యాణ్ చివరి సినిమా అని రిలీజ్ ముందు నుండే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొండగట్టు నుండి రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో తన సినిమా కెరీర్ గురించి సెన్సేషన్ ప్రకటన చేశారు.

పూర్తి స్థాయి రాజకీయాల్లో

పూర్తి స్థాయి రాజకీయాల్లో

ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొన బోతున్నారా? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.... అవును ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొంటాను అని సమాధానం ఇచ్చారు.

ఇకపై సినిమాలు చేయరా?

ఇకపై సినిమాలు చేయరా?

ఇకపై సినిమాలు చేయరా? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.... అవును, సినిమాల మీద ఆలోచన లేదు. ఇకపై సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ప్రకటనతో షాకైన ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ ప్రకటనతో షాకైన ఫ్యాన్స్

ఇకపై సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో అభిమానులు షాకయ్యారు. ఇకపై తమ అభిమాన హీరో నుండి సినిమాలు రావనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

గతంలో సినిమాలు చేస్తానన్న పవన్

గతంలో సినిమాలు చేస్తానన్న పవన్

గతంలో ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..... సినిమాలు లేకుంటే తనకు ఆదాయం ఉండదని, సినిమాలు చేస్తూనే రాజకీయాలు కొనసాగిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు పూర్తిగా సినిమాలు మానేస్తాను అని చెప్పడంలో అభిమానులు షాకయ్యారు.

వరుస ప్లాపులతో పవన్ డిసప్పాయింట్

వరుస ప్లాపులతో పవన్ డిసప్పాయింట్

పవన్ కళ్యాణ్ వరుస ప్లాపులతో డిసప్పాయింటుగా ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలపై విరక్తిచెంది పూర్తిగా రాజకీయాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వీడియో

పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో ఇదే. మీరూ ఓ లుక్కేయండి.

English summary
Pawan Kalyan Sensational Comment On His Film Career. "I'll Completely Stop Movies" Pawan kalyan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu