twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను భయపడను, , నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా..పవన్ సంచలన వ్యాఖ్యలు!

    |

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం దీక్ష చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు తన సినిమాలను టార్గెట్ చేస్తున్నారన్న ఆయన వాటిని ఉచితంగా చూపిస్తామని కూడా కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    వకీల్ సాబ్ టికెట్ల వివాదం

    వకీల్ సాబ్ టికెట్ల వివాదం

    నిజానికి ఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమా నుంచే ఈ టికెట్ల వివాదం చెలరేగింది. వకీల్ సాబ్ సినిమా అప్పుడే ఏపీలో దారుణంగా రేట్లు తగ్గించారు. అప్పుడు కోర్టుకు వెళ్లడంతో టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చింది. మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీంతో ఏపీలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అలా కూడా చేయదనాయికి వీల్లేకుండా ఒక జీవో తీసుకొచ్చింది.

    గొడవ పడాలని

    గొడవ పడాలని

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుని నిలిచే ధైర్యం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఈరోజు ఆయన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను ప్రధాని మోదీతో గొడవ పడాలని వైసీపీ కోరుకుంటోందని కానీ వైసీపీతో తాము గొడవలు కోరుకోవడం లేదని..ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపు ఇస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు.

     నేను ఏమి చేయలేనన్నారు

    నేను ఏమి చేయలేనన్నారు

    ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే ఆ పార్టీ ఎంపీలను చొక్కా పట్టుకుని నిలదీయాలని పవన్ పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ల తరఫున నిలబడతామని, లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను ఏమి చేయలేనన్నారు. నా సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని వైసీపీ నేతలు చూశారు కానీ నా సినిమాలను ఆపితే నేను భయపడనని ఆయన అన్నారు.

    సినిమాలు ఉచితంగా ఆడిస్తా

    సినిమాలు ఉచితంగా ఆడిస్తా


    అసలు పంతానికి దిగితే నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా" అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్న ఆయన ప్రైవేటీకరణను ఆపడం మా చేతుల్లో లేదని చెబుతున్న వైసీపీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ఆపుతామని ఎందుకు ప్రచారం చేసింది..? అని పవన్ ప్రశ్నించారు. ఇక సినిమా టిక్కెట్లల్లో పారదర్శకత లేదని అంటున్నారు, మరి ప్రభుత్వం చేసే మద్యం వ్యాపారంలో పారదర్శకత ఉందా అని పవన్ ప్రశ్నించారు. రూ.700తో మద్యం తాగి రూ. 5లతో సినిమా టికెట్ కొనుక్కుని వెళ్తే ప్రభుత్వానికి సంతోషంగా ఉంటుంది అని ఆయన ఎద్దేవా చేశారు.

    భరించక తప్పద

    భరించక తప్పద

    2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్న ఆయన 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామని అన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ పేర్కొన్నారు.

    English summary
    Pawan kalyan sensational comments on andhra pradesh government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X