Pawan Kalyan: చిరంజీవి అపజయమే నాకు శాపం... పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అంతటా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన ఇదే ముచ్చట. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా జననేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్యూర్ తనపై ప్రభావితం చూపిందంటూ.. అది తనకు శాపం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలు అటు రాజకీయ పరంగా, మెగా అభిమానుల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పవన్ కల్యాణ్ సినిమా నటుడిగానే కాకుండా.. జనసేన అధినేతగా ప్రజలకు సుపరిచితమే. ఇక తన అన్న చిరంజీవి మొదట 2009లో ప్రజా రాజ్యం అనే పార్టీ స్థాపించాడు. ఇక ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయగా.. కనీసం డిపాజిట్లు కూడా రాలేకపోయింది. ఇక ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ తమ్ముడు జన సేన పార్టీతో ప్రజల ముందుకు వచ్చాడు. పవన్ కల్యాణ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.

Pawan Kalyan Sensational Comments on Chiranjeevi about Telangana Elections 2023 Results Full Details Here

అయినా తట్టుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లాడు పవన్ కల్యాణ్. ఇక తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 3న ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఈ నేపథ్యంలో తన అన్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి.

చిరంజీవి ఫెయిల్యూర్ తనను రాజకీయాల్లో ప్రభావితం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 2009లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు తన సోదరుడు ప్రజలకు విధేయుడిగా ఉండలేకపోయినందున తనను ఎవరూ నమ్మలేదని పవన్ అన్నారు. కాబట్టి, పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా, చిరంజీవి వైఫల్యం కారణంగా ప్రజలు అతనిని లేదా నాయకుడిగా అతని మాటలను నమ్మలేరు.

Pawan Kalyan Sensational Comments on Chiranjeevi about Telangana Elections 2023 Results Full Details Here

మెగాస్టార్ చిరంజీవి "ప్రజా రాజ్యం" అనే రాజకీయ పార్టీని 2009లో ప్రారంభించి, దానిని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా మందికి షాకింగ్ నిర్ణయం. చిరంజీవి ఫెయిల్యూర్ నన్ను రాజకీయాల్లో ప్రభావితం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు ఏమాత్రం సంతోషించడం లేదు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావని అంటున్నారు.

ప్రజారాజ్యాన్ని విలీనం చేయడంతో రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యాన్ని నేరుగా పవన్ చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. దాని వల్లే తన జనసేన పార్టీ రాజకీయాల్లో పెద్దగా విజయం సాధించలేకపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 2009 అపజయం లేకుంటే జనసేన పార్టీ స్వతంత్ర పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని వెల్లడించారు. చిరంజీవి ఫెయిల్యూర్ తనను ప్రభావితం చేసిందని పవన్ కళ్యాణ్ అనడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి వల్లే పవన్ పెద్ద స్టార్ అయ్యాడని మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X