సీఎం చేయమని ఎవరినీ అడగం.. సత్తా చాటి గెలుచుకొంటాం.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలోని జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని గురువారం ఉదయం రాజమండ్రిలో ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రారంభించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి సీఎం అభ్యర్థిత్వంపై తొలిసారి స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తాను అమలు పరచబోయే తన వ్యూహంపై తొలిసారి పెదవి విప్పారు. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారు అనే విషయంలోకి వెళితే..

రాజమండ్రిలో పార్టీ కార్యాలయం: రాజమండ్రిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు కేరళ తరహా ప్రత్యేక వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. పవన్ కల్యాణ్ వెంట పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, శ్రీ ముత్తా శశిధర్, పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగంతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.

 Pawan Kalyan sensational comments on CM post of Andhra Pradesh in Rajahmundry tour

ఏపీలో 40 స్థానాలు ఉంటే: ఆంధ్ర ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో మాకు బలం ఉంది. మా బలం మీదే ఆధారపడి సీట్ల పొత్తు ఉంటుంది. కొన్ని జిల్లాలో మా బలం ఎక్కువ. కొన్ని జిల్లాలో మాకు బలం తక్కువ అనేది నిజం. కనీసం 30 లేదా 40 స్థానాలు ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటామని అనగలం అని పవన్ కల్యాణ్ అన్నారు.

 Pawan Kalyan sensational comments on CM post of Andhra Pradesh in Rajahmundry tour

టీడీపీనో, బీజేపీనో అడగం: ఏపీలో బలంగా ప్రజల మద్దతు, పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. సీఎం కావాలనుకొంటే సీఎం అయిపోరు. నన్ను సీఎం చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగను. మా బలం, మా సత్తా చూపించి అడుగుతాను. మాకు బలం ఉన్న జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తాను. పార్టీ నేతలను, కార్యకర్తల్లో మనోధైర్యం కలిగేలా కార్యక్రమాలను రూపొందిస్తాం అని పవన్ కల్యాణ్ చెప్పారు.

 Pawan Kalyan sensational comments on CM post of Andhra Pradesh in Rajahmundry tour

రాజమండ్రిలో సంచలన వ్యూహంతో: జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ సీఎం పదవి గురించి ఎన్నడూ మాట్లాడలేదు. అభిమానులే ఆయన సభల్లో, ర్యాలీలో తమ మనసులోని మాటను బయటపెట్టుకొనే వారు. కానీ తాజాగా రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవి గురించి ఒక స్పష్టతను ఇచ్చారు. అందుకు కొన్ని జిల్లాలో పెరుగుతున్న బలాన్ని అంచనా వేసే ఇలా స్పందించారని రాజకీయ, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

UstaadBhagatSingh

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌తో: ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని, ఎడిటర్ చోటా కే ప్రసాద్, దర్శకుడు దశరథ్ తదితరులు హాజరయ్యారు. ఈ గ్లింప్స్‌కు అభిమానుల నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X