Just In
- 7 min ago
అమెజాన్, నెట్ఫ్లిక్స్లా సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌ను తెస్తున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్..
- 13 min ago
వెంకీమామ ట్రైలర్: రొమాన్స్, కామెడీ, డైలాగ్స్ అన్నీ హైలైటే.. మామాఅల్లుళ్ళ హంగామా
- 58 min ago
మరోసారి విరుచుకుపడ్డ పూనమ్.. వాళ్ళ కంటే వ్యభిచారులే బెటర్ అంటూ సెన్సేషన్
- 12 hrs ago
ట్రెండింగ్ :బూతులు మాట్లాడిన అనసూయ..చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్..వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో
Don't Miss!
- News
ఆనం వ్యాఖ్యల వెనుక..! చంద్రబాబు తో భేటీ ఎఫెక్టేనా: అసలు టార్గెట్ మంత్రి అనిల్..!
- Technology
మార్కెట్లోకి షియోమి నకిలీ ఉత్పత్తులు... జాగ్రత్త సుమా...
- Lifestyle
ఆదివారం మీ రాశిఫలాలు 8-12-2019
- Sports
హైదరాబాద్‌లో పీవీ సింధుకి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
టాలీవుడ్, తెలుగు హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన అన్నది ఎవరిని.?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఆ తర్వాత ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేశారు. వైవిధ్యమైన సినిమాలు చేయడంతో పాటు యూత్‌కు కావాల్సిన అంశాలను పట్టుకుని క్రేజ్ సంపాదించుకున్నారు. స్టైల్, యాక్టింగ్‌లో విభిన్నమైన శైలితో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోగా ఎదిగిన పవన్.. కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అంతేకాదు, ఓ పార్టీని కూడా స్థాపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్, తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు.? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు..?

సినిమాలను కూడా వదిలేసి అదే పని
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి'. దీని తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడం కోసం సినిమాలను వదిలేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా పవన్ నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు.

పవన్ రీఎంట్రీ గురించి ప్రకటన
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న పవన్.. త్వరలోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్పష్టం చేసేశారు కూడా. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్' సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కనుందని కూడా ఆయన ప్రకటించారు.

టాలీవుడ్ రైటర్స్‌పై కామెంట్స్
తెలుగు భాష గురించి భాషా పండితులతో సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. దానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రస్తుతం సినీ పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతోంది. ముఖ్యంగా పాండిత్యం రాను రానూ తగ్గిపోతోంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యం అస్సలు తెలియవు' అని పేర్కొన్నారు.

తెలుగు పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్
కేవలం రచయితల గురించే కాదు.. తెలుగు సినీ పరిశ్రమపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేడసాని మోహన్ గారి లాంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవి. కానీ, ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్ల వద్దే ఉంటోంది. మాతృ భాషను మర్చిపోవడం వల్లే ఈ గతి పట్టింది' అంటూ పవన్ చెప్పుకొచ్చారు.

తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు
ఇదే సమయంలో ఆయన తెలుగు హీరోలపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది తెలుగు హీరోలు సినిమాలు చేస్తారు. ఇక్కడే డబ్బులు సంపాదిస్తారు. కానీ, ఇక్కడి భాష అయిన తెలుగును మాట్లాడడం, ఉచ్చరించడం తెలియదు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పవన్ అన్నది ఏ హీరోలను అని చర్చ జరుగుతోంది.