twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Idupulapaya నేల మాలిగలో లక్ష కోట్ల సంపద.. వైఎస్ వివేకా హత్య ఎలా జరిగింది.. ఏపీ సర్కార్‌పై పవన్ ధ్వజం

    |

    సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం వివాదాస్పద వ్యాఖ్యలతో సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ పవన్ చెలరేగిపోయాడు. సినిమా టికెట్ల అమ్మకంపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీ ఖజానా ఖాళీ అయిందంటూ.. అందుకే టిక్కెట్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నదంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...

    ప్రకాశ్ రాజ్‌తో అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూ

    ప్రకాశ్ రాజ్‌తో అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూ

    ప్రకాశ్ రాజ్ గురించి లోకల్, నాన్ లోకల్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటారు. ప్రకాశ్ రాజ్‌కు, నాకు పడదు. కానీ సినిమాలో కలిసి నటించాం. మా మధ్య ఉన్నది అభిప్రాయభేదాలే. కాబట్టి.. ప్రకాశ్ రాజ్‌కు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది. సినిమా పరిశ్రమలో మా మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి. కానీ అవి సినిమా వరకే అని పవన్ కల్యాణ్ చెప్పారు.

    సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి కాదు..

    సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి కాదు..

    సినిమా పరిశ్రమ పెద్దలే కాకుండా ప్రేక్షకులు, ప్రతీ ఒక్కరు థియేటర్లలో సినిమా చూడాలని కోరుకొంటున్నారు. అలాంటి సినిమా పరిశ్రమ సున్నితమైంది. అలాంటి పరిశ్రమను టార్గెట్ చేయడం వాళ్లకు చాలా ఈజీ. పరిశ్రమను ఆదుకోవడానికి బదులు సాయిధరమ్ తేజ్‌ను టార్గెట్ చేయడం సరికాదు. అయితే ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అని పవన్ కల్యాణ్ అన్నారు.

    వివేకా, కోడికత్తి గురించి మాట్లాడండి..

    వివేకా, కోడికత్తి గురించి మాట్లాడండి..

    ఏపీలో పరిష్కరించాల్సిన విషయాలను వదిలిపెట్టి.. సాయిధరమ్ తేజ్ ఎలా యాక్సిండెంట్‌కు గురయ్యారు అని కథనాలు నడుపుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు.. ఎందుకు హత్యకు గురయ్యాడనే విషయంపై మీడియాలో కథనాలు నడపాలి. తేజ్ యాక్సిడెంట్ కంటే. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నాయకుడిని కోడికత్తితో పోడిచారు. అప్పుడు గవర్నర్ నరసింహన్ కూడా దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. అది ఏమైంది అని అడగండి అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రశ్నించారు.

    వ్యభిచారం చట్టబద్దం చేయాలా?

    వ్యభిచారం చట్టబద్దం చేయాలా?

    లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూములు చేసుకోంటుంటే.. వారికి అది దక్కడం లేదు. గిరిజనులకు పోడు భూములు ఎందుకు దక్కడం లేదనే విషయంపై కథనం నడపండి. ఆరేళ్ల బిడ్డ చరిత అన్యాయంగా అక్రమంగా హత్యకు గురైతే దాని మీద కథనాలు నడపకుండా.. తేజ్ యాక్సిడెంట్‌పై కథనాలు నడిపారు. ఇంకా మసాలా స్టోరి కావాలంటే.. కొందరు వైసీపీ సానుభూతిపరులు, నేతలు డిమాండ్ చేసినట్టు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలన్న విషయంపై కథనాలు నడపండి అంటూ పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.

    టీడీపీ ప్రభుత్వంలో కాపు హక్కుల గురించి ప్రశ్నించిన విషయంపై, రాయలసీమలో బోయలు ఎందుకు నలిగిపోతున్నారనే విషయంపై కథనాలు నడపండి అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

    ఇడుపులపాయలో నేల మాలిగలో టన్నులు, లక్షలు అంటూ

    ఇడుపులపాయలో నేల మాలిగలో టన్నులు, లక్షలు అంటూ

    ఇడుపులపాయలో నేల మాలిగలో టన్నుల కొద్ది, కోట్ల రూపాయల సంపద ఉందని పోలీసులు కూడా నాకు చెబుతుంటారు. దానిపై కథనాలు నడిపితే ఇంటికి వచ్చి కొడుతారు. అదే సాయిధరమ్ తేజ్‌ కోమాలో ఉంటే ఆయనపై కథనాలు నడుపుతున్నారు. ఎందుకుంటే అతడు వచ్చి కొట్టలేడు కదా.. ఎప్పుడైనా సినిమా వాళ్లు సాఫ్ట్ టార్గెట్ అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్

    వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్

    సినిమా పరిశ్రమను తొక్కేసి.. సినిమాలను ఆపేస్తే ఇంకా నష్టం జరుగుతుంది. జోగి జోగి రాసుకొంటే బూడిద రాలుతుందిరా వెధవల్లారా.. సంపద సృష్టించే మార్గాలపై దృష్టిపెట్టాలి. ఏపీలో పిచ్చి పచ్చి వేషాలు వేస్తే.. బయటకు తీసుకొచ్చి కొడుతాం. ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్. అధికారం ఉందని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గడాఫిని నడిరోడ్డులో కుర్రాళ్లు చంపిన చరిత్ర పునరావృతం అవుతుంది అని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. కాబట్టి అధికారంలో ఉన్న వాల్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని బతకాలి అని సూచించారు.

    English summary
    Power Star Pawan Kalyan made speech at Republic movie pre release event. targets Ap Minister Nani Alla and Ap Government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X