»   » పెండ్లైన కూతురుంది. బూతు చిత్రాలు చూస్తాడు.. వర్మపై పవన్ ఎటాక్

పెండ్లైన కూతురుంది. బూతు చిత్రాలు చూస్తాడు.. వర్మపై పవన్ ఎటాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెండ్లైయిన కూతురు పెట్టుకొని బూతు సినిమాలు చూసే వ్యక్తి వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకొనే స్థితిలో తాను లేనని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదాపై శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో వర్మపై మండిపడ్డారు.

Pawan Kalyan shots on Ram Gopal varma on AP special status

'రాంగోపాల్‌వర్మ గురించి ఒకటే మాట చెప్తాను. వర్మ దాదాపు 50 ఏండ్లకు పైబడిన వ్యక్తి. ఈ మధ్యనే కూతురు పెండ్లి చేశారు. పైగా పెండ్లి అయిన కూతురు ఉన్న వ్యక్తి పోర్నోగ్రఫీ సినిమాలను చూస్తాను అని చెప్తాడు. అలాంటి వ్యక్తి మాటలపై ఏం మాట్లాడాలి. ఆయన ఒకరోజు నన్ను ఆకాశానికి ఎత్తవచ్చు. మరో రోజు అక్కడి నుంచి కింద పడేయవచ్చు. అలాంటి వ్యక్తి, అలాంటి వారందరికి మాటలకు సమాధానం చెప్పుకొనే స్థితిలో లేను'అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇటీవల కాలంలో మెగా బ్రదర్స్ టార్గెట్ చేసుకొని ట్వీటర్‌లో ఎడాపెడా ట్వీట్లు వదులుతున్న వర్మకు సమయం చూసి సరిగ్గానే కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం మెగా ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నది.

English summary
Pawan Kalyan shots on Ram Gopal varma on AP special status
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu