అభిమానుల కోసం ఖాతా తెరిచిన ‘పవన్ కల్యాణ్’
మీడియాకు దూరంగా ఉండే తెలుగు సినీ స్టార్లలో పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇతర హీరోలు.... అభిమానులు, మీడియాకు ఎల్లప్పుడు కంటాక్టులో ఉండటం కోసం ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వవర్కింగ్ సైట్లలో అకౌంట్స్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ మాత్రం ఇప్పటి వరకు అలాంటి వాటి జోలికి పోలేదు. మరి ఇప్పటికైనా మీడియా పవర్, అభిమానులతో కమ్యూనికేషన్ విలువ తెలుసుకున్నాడో? ఏమో గానీ పవర్ స్టార్ తాజాగా....యూట్యూబ్ లో అకౌంట్ ఓపెన్ చేశాడు. నవంబర్ 30న దీన్ని ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. 'pawankalyanofficial" పేరుతో ఈ అకౌంట్ ఉంది. అయితే అందులో ఎలాంటి పోస్టులు లేవు.
'పంజా" సినిమా రిలీజ్ కు ముందు నుంచి ఇందులో పవన్ పోస్టులు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపై పవన్ తన అభిమానులతో అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ యూట్యూబ్ అకౌంట్ ను ఉపయోగిస్తారని అంటున్నారు. అదే జరిగితే అభిమాలకు పండగే.
అయితే ఇది మరి నిజంగా పవన్ కల్యాణ్ ఓపెన్ చేసిన అకౌంటేనా? లేక 'pawankalyanofficial" పేరుతో వేరే ఎవరైనా ఓపెన్ చేశారా? అనే అమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంజా మూవీ మేకర్స్ సినిమా ప్రచారం కోసం దీన్ని క్రియేటర్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దీనిపై స్వయంగా పవర్ స్టార్ ప్రకటన చేస్తే తప్ప నమ్మడానికి వీల్లేదని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











