‘షాడో’ పవన్ కళ్యాణ్ నెగటివ్ రోలే కాదు నెగటివ్ షేడ్ కూడా....!
పవన్ కళ్యాణ్ గడ్డం పెంచాడు. తీన్ మార్ ఆడియో రిలీజ్ తర్వాత బయటెక్కడా కనపడని తన న్యూ లుక్ బయటకి తెలీకుండా జాగ్రత్త పడుతున్నట్టున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకుడుగా 'ది షాడో' అనే సినిమా ఈ నెల 6న కోల్కతాలో షూటింగ్ మొదలు పెట్టారు. మాఫియా నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నెగెటివ్ షేడ్స్ ఉండే పాజిటివ్ రోల్ చేస్తున్నాడని, అండర్ వరల్డ్చ మాఫియా అంవాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని చెప్పుకుంటున్నారు. పవన్ ని ఇంతవరకు ఏ దర్శకుడు చూపించని విధంగా సరికొత్తగా చూపిస్తానంటూ డైరెక్టర్ విష్ణువర్థన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఈ సినిమాని అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గణేష్ బాబు నిర్మాతగా రాబోతున్న గబ్బర్ సింగ్ జూలైలో మొదలు పెట్టి 2012 జనవరిలో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











