మాఫియా డాన్ గా విలక్షణమైన పాత్రలో పవన్ కళ్యాణ్
మాఫియ నేపద్యంలో సాగే 'షాడో'చిత్రంలో పవన్ కళ్యాణ్ డాన్ గా నటించనున్నాడు.తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే రెండోవారంలో సెట్స్ ఫై కి వెళ్ళనుంది. 90 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకోనున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోల్ కత లో మొదలవనుంది. సారా జానే డయాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా, సంఘమిత్ర బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.ఇక పవన్ తాజా చిత్రం తీన్ మార్ కలెక్షన్స్ అన్ని చోట్లా తగ్గిపోయాయి. మల్టిఫ్లెక్స్ లు ,ఎ సెంటర్లలలో ఓ మాదిరిగా ఉన్న కలెక్షన్స్ ను మిస్టర్ ఫెరఫెక్ట్ దెబ్బకొట్టింది.


Click it and Unblock the Notifications











