పవన్ కల్యాణ్‌తో షేక్ హ్యాండ్ కోసం కొడాలి నాని కష్టాలు.. గన్‌మెన్లు తోసేసినా పట్టువదలకుండా! (వీడియో)

విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పవన్ కల్యాణ్ రాకతో అభిమానులు పండుగ చేసుకొన్నారు. అయితే ఈ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే కొడాలి నాని వీడియోలపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం మరింత వైరల్ అయింది. ఆ వీడియోపై జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు స్పందించిన తీరు వివరాల్లోకి వెళితే..

వంగవీటి రాధా పెళ్లికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. పవన్ రాకను తెలుసుకొన్న జనసైనికులు భారీగా ఈ పెళ్లికి తరలి వచ్చారు. పవన్ కల్యాణ్‌ను చూడటానికి ఎగబడ్డారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు తోసుకోవడంతో భారీ గందరగోళం నెలకొన్నది. తోసుకొంటూ వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం బాడీగార్డులకు, గన్‌మెన్లకు తలకు మించిన భారంగా మారింది.

Pawan Kalyan shake hand to MLA Kodali Nani at MLA Radha Krishna Marriage: Video goes Viral

అయితే వంగవీటి రాధాకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడానికి స్టేజ్‌పైకి పవన్, నాదెండ్ల వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా తోసుకొంటూ వేదికపైకి వచ్చారు. అయితే అప్పటికే లైన్‌లో ఉన్న కొడాలి నానిని గన్‌మెన్లు, బాడీ గార్డులు వెనక్కి నెట్టడం వీడియోలో కనిపించింది. అయితే వారికి నచ్చ జెబుతూ నాని ముందుకు వచ్చేందుకు ప్రయత్నించాడు.

చివరకు రాధా వివాహ వేదికపైన పవన్ కల్యాణ్, నాదేండ్ల ఉన్న సమయంలోనే బాడీగార్డులను, గన్‌మెన్లకు నచ్చ జెబుతూ అక్కడికి చేరుకొన్నారు. పవన్ కల్యాణ్‌కు బాడీగార్డులు, గన్‌మెన్లు రక్షణ వలయంగా ఏర్పడి ఎమ్మెల్యే నాని అడ్డుకొన్నారు. అయితే అభిమానులను తోసుకొంటూ వస్తున్న నానిని చూసిన పవర్ స్టార్ ఓ చిరునవ్వి నవ్వి తన చేతిని అందించారు. దాంతో నాని హ్యాపీగా ఫీలైనట్టు వీడియోలో కనిపించింది.

Pawan Kalyan shake hand to MLA Kodali Nani at MLA Radha Krishna Marriage: Video goes Viral

అయితే పవన్ కల్యాణ్‌ను కలుసుకోవడానికి వస్తున్న కొడాలి నానిని గన్‌మెన్లు అడ్డుకోవడం వీడియోలో కనిపించింది. అయినా కొడాలి నాని తన ప్రయత్నాన్ని ఆపలేదు. చివరకు పవన్ కల్యాణ్ దృష్టిలో పడేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది అని పవన్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాజకీయంగా పవన్ కల్యాణ్‌ను నోటికి వచ్చినట్టు తిట్టే కొడాలి నాని ఏకంగా ఆయనను చూడటానికి, ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి నానాపాట్లు పడ్డారు. గన్‌‌మెన్లు, బాడీ గార్డులు తోసి వేస్తున్నా ముందుకెళ్లి పవన్ కల్యాణ్‌తో షేక్ హ్యాండ్ తీసుకొన్నారు అని జనసైనికులు, పవర్ స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడంతో Pawan Kalyan హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X