పవన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్ల వల్లే సినిమాలు ఆలస్యమంటూ..

పవర్ స్టార్ , ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇపుడు ఎంత బిజీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా తాను ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే పాన్ ఇండియా ఫేమ్ ని పొలిటికల్ గా తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఇప్పటికే పవన్ ఓకే చేసిన సినిమాలు అలా ఆలస్యం అవుతూ వస్తున్నాయి.

పవన్ విషయంలో ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో సినిమాలు ఆలస్యం అనే కాన్సెప్ట్ ఉంటూనే ఉంది. అలా ఎక్కువ కాలం షూట్ చేసిన సినిమాలూ ఉన్నాయి అలాగే తక్కువ వ్యవధిలోనే కంప్లీట్ చేసేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇపుడు కూడా ఇదే తరహాలో మొత్తం మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అలా ఆలస్యం అవుతూ వస్తున్నాయి.

pawan kalyan shocking comments over his movies late blaming his makers

పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం మూలానే సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయని టాక్ ఉంది. ఈ సమయంలో పవన్ చేసిన షాకింగ్ కామెంట్స్ కొన్ని ఇపుడు షాకింగ్ గా మారాయని చెప్పాలి. తాను ఇపుడు ఓకే చేసిన సినిమాలు అన్నీ కూడా నేను డేట్స్ ఇస్తే వాళ్ళు వినియోగించుకోలేకపోయారు అని పవన్ రివీల్ చేశారు.

మొత్తం మూడు సినిమాలు .. హరిహర వీరమల్లు, ఓజి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూడు సినిమాలూ తాను చేయాల్సినవి. అయితే తాను అన్ని సినిమాలకి షూటింగ్‌లో పాల్గొనడంపై ముందే చెప్పేసానని పవన్ తెలిపారు. తాను ఫలానా సమయం వరకే డేట్స్ ఇవ్వగలను అని ఆ లోపే షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని చెప్పానని వెల్లడించారు. కానీ ఆ సమయంలో సినిమాలు పూర్తి చెయ్యలేదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు పవన్.

ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా డేట్స్ ఇస్తే వారు స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం, స్క్రిప్ట్ మళ్ళీ మార్చడం వంటి వాటితో నేను డేట్స్ ఇచ్చిన సమయంలో సకాలంలో పూర్తి చేయలేకపోయారని పవన్ వెల్లడించారు. ఇక ఓజి సినిమాకి కూడా ముందే నేను లేని సీన్స్ అన్నీ ముందు చేసెయ్యండి అని చెప్పేసానని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తర్వాత తాను ఉండాల్సిన సీన్స్ చేస్తానని చెప్పానని.. ఓజి అంత వేగంగా పూర్తి అవ్వడానికి అందరినీ తానే పుష్ చేశాను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే.. తాను ఇప్పటికే ఉన్నంతలో సినిమా పూర్తి చేశానని పవర్ స్టార్ వెల్లడించారు. కానీ ఆ చిత్రానికి విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉండడంతో అదీ అలా ఆలస్యం అవుతూ.. ఇపుడు ఫైనల్ స్టేజిలో ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బహుశా ఆ సినిమానే ముందు రావాల్సింది అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఇపుడు తన ఫ్యాన్స్ ని సైతం షాక్ అయ్యేలా చేసింది.

దీనితో ఇన్నేళ్లు సినిమాలు ఆలస్యం అవుతుంది కేవలం పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లే అని అనుకుంటున్న వారికి అసలు నిజం తెలిసొచ్చింది. తాను ఇచ్చిన డేట్స్ లో మేకర్స్ సినిమాలు చేసుకోలేకపోయారు అంటూ పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొత్తం మీద తన కామెంట్స్ సినీ వర్గాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X