Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ షూటింగ్...అమెరికాలో
జయంత్ పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ జూన్ ఒకటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. గణేష్ బాబు నిర్మిస్తున్నఈ చిత్రం యుయుస్ లో షూటింగ్ జరగనుంది. అందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు వేయనున్నారు. ఇక హిందీలో 'లవ్ ఆజ్ కల్" చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకొనే నటించారు. మంచి విజయాన్ని అందించిన చిత్రం ఈ రీమేక్ వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా రెడీ అయిపోతుందని తెలుస్తోంది. సింపుల్ లవ్ స్టోరి కావడంతో ఈ సినిమాలో ఇతరత్రా హంగామా పెద్దగా ఉండదు కనుక షూటింగ్ స్పీడుగా జరిగిపోతుందని చెప్తున్నారు. ఒక్కసారి పెట్స్ మీదరకు వెళితే ఏకధాటిగా సినిమాను పూర్తి చేసేస్తారని వినపడుతోంది. జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నవంబర్ కల్లా షూటింగ్ పార్ట్ ముగించి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రం పాటల బిజీలో ఉన్నారు.