పవర్‌స్టార్ ఎనర్జీ లెవల్స్‌కు బిత్తరపోయి హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ లెవల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన చురుకైన నటనా టాలెంట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు పవన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చీలో జరుగుతోంది. అక్కడ పవన్‌కళ్యాణ్, శృతిహాసన్‌లపై ఇటీవల ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. ఈ సందర్బంగా శృతిహాసన్ మాట్లాడుతూ 'గబ్బర్‌సింగ్' తొలి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఫస్ట్‌టైమ్ పవన్ కాంబినేషన్‌లో నటిస్తున్నాను. మా ఇద్దరిపై ఓ పాటని చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణలో పవన్ ఎనర్జీ, డాన్స్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. షూటింగ్ జరుగుతున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పకొచ్చింది.
నేను ఇప్పటి వరకు మోడ్రన్ గర్ల్‌గా నటించాను. ఈ చిత్రంలో మాత్రం మధ్య తరగతి గ్రామీణ యువతిగా సంప్రదాయమైన పాత్రలో కనిపిస్తాను. చాలా ప్రత్యేకతలతో సిద్ధమవుతున్న 'గబ్బర్‌సింగ్' నాకెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది' అని తెలిపింది.


Click it and Unblock the Notifications











