బ్రేకింగ్ న్యూస్?... మెగా బడ్జెట్ మూవీకి సైన్ చేసిన పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించారు. గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆయన తన ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టారు. ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని, జనసేన పార్టీ తరుపున ప్రజా పోరాటంలో భాగం అవుతానని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఉమైర్ సంధు సంచలన ట్వీట్
యూకెలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ గురించి ఈ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ఓ మెగా బడ్జెట్ మూవీకి సైన్ చేశారని, అయితే 2019 ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారు?
అయితే పవన్ కళ్యాణ్ సైన్ చేసిన ఈ మెగా బడ్జెట్ మూవీకి నిర్మాత ఎవరు? దర్శకుడు ఎవరు? అనే విషయాలు మాత్రం ఉమైర్ సంధు వెల్లడించలేదు. మరి ఉమైర్ సంధు చెప్పినదాంట్లో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
గుడ్ జోక్ అంటూ సెటైర్లు
అయితే ఉమైర్ సంధు చెప్పిన విషయాలు చాలా మంది నమ్మడం లేదు. చాలా పెద్ద జోక్ వేశావంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఇపుడు పొలిటీషియన్, సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని ఆల్రెడీ చెప్పారు అని కామెంట్స్ చేస్తున్నారు.
నీ ఫన్నీ ట్వీట్స్ ఇకనైనా ఆపు
నువ్వు ఇలాంటి ఫన్నీ ట్వీట్స్ చేస్తావు కాబట్టే నిన్ను ఫాలో అవుతున్నాం... మరికొందరు ఉమైర్ సంధు మీద పంచ్‌ల వర్షం కురపించారు. మరికొందరేమో ఇది నిజంగా నిజమా? అంటూ ఆయన్ను ప్రశ్నలతో ముంచెత్తారు.


Click it and Unblock the Notifications