»   » చెన్నై వరదలు: పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి?

చెన్నై వరదలు: పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందుండే వారిలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అతలా కుతలం అవుతున్నా, చెన్నై నగరం మొత్తం నీట మునిగి అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్న పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం చర్చనీయాంశం అయింది.

టాలీవుడ్ నుండి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. మరికొందరు క్షేత్రస్థాయిలోని బాధితులకు నేరుగా ఫుడ్, మెడికల్ సప్లిస్, త్రాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు స్టార్స్ నేరుగా రంగంలోకి దిగి మనమద్రాస్ కోసం అంటూ విరాళాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.

గతంలో హూదూద్ తుఫాన్ సమయంలో అంరికంటే ముందుగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ సారి మాత్రం మౌనం ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో ఉన్నారు. మరి షూటింగులోనూ బిజీగా ఉండటం వల్ల సైలెంటుగా చెన్నై సహాయానికి సంబంధించి తన పని తాను చేసుకుపోతున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తేలాల్సి ఉంది.

Pawan Kalyan silence about Chennai floods

చెన్నై వరద బాదితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కొందరు డబ్బు రూపంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా....మరికొందరు ప్రస్తుతం వారికి అవసరం అయిన ఆహారం, మెడికల్ సప్లిస్, తాగునీరు, ఇతర వస్తువులు అందించేందుకు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా రానా, మంచు లక్ష్మి, అల్లరి నరేష్, అఖిల్, నవదీప్,సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్, నిఖిల్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, మధు శాలిని, తేజస్వి మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఆదివారం ‘మన మద్రాస్ కోసం' అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి విరాళాలు, సహాయ సామాగ్రిని సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంజీరా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, కూకట్ పల్లిలోని ఫోరమ్ సంజానా మాల్ లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పలువురు సెలబ్రిటీలు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు.

English summary
Pawan Kalyan is shocking all with his silence about Chennai flood victims. This is unlike Pawan who earlier was the first person to help the hudhud victims in Visakhapatnam.
Please Wait while comments are loading...