ఒక్క రక్తపు బొట్టు నుంచి మనిషిగా మారిన పవన్ కళ్యాణ్...!?
'సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఆదిత్య ప్రొడక్షన్ బ్యానర్, కొండక్రిష్ణం రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ జీసస్ పాత్ర చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడ జీసస్ గా పవర్ స్టార్ యాక్ట్ చేయడంలేదనేది తాజావార్త. కానీ ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడన్నది సెన్సేషనల్ న్యూస్. ఆ పాత్ర ఏంటి అనే విషయాన్ని ఆరా తీయగా పవన్ పాత్ర ఏంటనే విషయం ఇలా బయటపడినట్లు సమాచారం.
జీసస్ కు శిలువ వేసే ముందు కాళ్ళకు, చేతులకు మేకులు కొడతారు. అలా మేకులు కొట్టే వ్యక్తి చాలా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన పని తాను చేసుకుంటూ వుండగా..మేకులు కొట్టే టప్పుడు జీసస్ చిందించిన రక్తం ఒక్కసారిగా ఆ క్రూరుడి మొఖంపై పడుతుందట. ఆ రక్తం తన మొఖం పై నుంచి కారుతూ కంటిపైకి రావటం, తన కంట్లోనుంచి రక్తం కారుతుండటంతో ఆ క్రూరుడు తన క్రూరత్వాన్ని గ్రహించుకుని ఒక్కసారిగా మారు మనస్సు పొంది తను మేకులు కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడట.
ఒక్క రక్తపుబొట్టు ఆ క్రూరుడ్ని మార్చటం ఆ సినిమాకి కీలకమైన మలుపు అవుతుందని తెలుస్తుంది. అలా క్రూరత్వమైన పాత్ర నుంచి ఓ మంచి మనిషిగా మారే పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించనున్నాడనేది విశ్వసనీయంగా అందిన సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాల్సిందే. మొత్తం మీద పిల్లల కోసం రూపొందే ఈ చిత్రంలో పవర్ స్టార్ పిల్లలకు స్పూర్తినిచ్చే పాత్ర చేయడం అభినందనీయం అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీగా వుందని, జూన్ 30 ముంబాయ్ లో లాంచ్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళంలో పవన్ కల్యాణే నటించనున్నాడని కూడా సమాచారం.


Click it and Unblock the Notifications











