మరో సారి పాటపాడుతున్న పవన్: అఙ్ఞాతవాసి "కొడకా కోటేస్వర్రావా"

"కాటమరాయుడా.." అంటూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడిన పవన్.. ఇప్పడు అజ్ఞాతవాసిలో కూడా అదే టైప్‌లో ఓ జానపద గీతం పాడబోతున్నారట.

Recommended Video

మరో సారి పాటపాడుతున్న పవన్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసాయి. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాటమరాయుదు లాంటి చిన్న డిసప్పాయింట్‌మెంట్ తర్వాత ఆసక్తికరమైన కాంబోతో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయ్.

 పవన్ కళ్యాణ్ పాట పాడాడు

పవన్ కళ్యాణ్ పాట పాడాడు

ఈ సినిమాకి టైటిల్స్ గా చాలా ప్రచారం జరిగినా చివరకు "అజ్ఞాతవాసి" టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడంట.

 కాటమరాయుడా

కాటమరాయుడా

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడా' అంటూ ఓ సాంగ్ పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో, ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే.

 కొడకా కోటేశ్వరావా

కొడకా కోటేశ్వరావా

తాజాగా వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న"అజ్ఞాతవాసి" అని టైటిల్ అనుకుంటున్న చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్నారనే వార్త ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది. "కాటమరాయుడా.." అంటూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడిన పవన్.. ఇప్పడు కూడా అదే టైప్‌లో ఓ జానపద గీతం పాడబోతున్నారట.

 అనిరుధ్ సంగీతం

అనిరుధ్ సంగీతం

యంగ్ సంచలనం అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా' అనే లైన్స్‌తో ఉండబోతుందట. ఈ పాట ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు తాజాగా వ్యాపించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ యమా హడావిడిగా తమ ఫ్యాన్స్ పేజీల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.

 ఆడియో విడుదల

ఆడియో విడుదల

ఎప్పడెప్పుడు ఈ సాంగ్‌ని రికార్డ్ చేస్తారా, ఎప్పుడు ఈ సాంగ్ బయటికి వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారనే వార్తలు సోషల్ మీడియా లో బాగానే స్ప్రెడ్ అవుతున్నాయి. డిసెంబర్‌లో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X