మెగా ఈవెంటుకు పవన్ కళ్యాణ్ రావడం లేదు

By Bojja Kumar

హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం' ఆడియో వేడుక అక్టోబర్ 25న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్‌కు సంబంధించిన ఇతర సినిమా కార్యక్రమాలకు హాజరైన పవన్ కళ్యాణ్...ఈ వేడుకకు మాత్రం గైర్హాజరవుతున్నారు. ఈ ఆడియో వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. మెగా హీరోలందరూ ఒకే వేదికపైకి వస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురు కాబోతోంది. పవన్ కళ్యాణ్ ఎందుకు రావడం లేదనే దానిపై సరైన సమాచారం లేదు.

 Pawan Kalyan to Skip PNLJ Audio Launch

గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం'. ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని హర్షిత్, బన్నివాస్ నిర్మిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నబాబు, వేమారెడ్డి, నిర్మాతలు:బన్ని వాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X