ఫ్లాష్ బ్యాక్: మహేష్ హిట్టు సినిమా... అది చూసి పవన్ నిద్రపోయాడట!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఈ ఇద్దరి హీరోలకు సంబంధించిన సినిమాలు వస్తే చాలు అభిమానులు ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ పవర్ స్టార్, సూపర్ స్టార్స్ కి సంబంధించిన వార్తలు మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈ స్టార్స్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి.

మహేష్ కోసం పవన్..

మహేష్ కోసం పవన్..

అర్జున్ సినిమా విడుదల సమయంలో పైరసీని అరికట్టేందుకు మహేష్ ఇండస్ట్రీకి ఒక పిలుపునిచ్చారు. ఆ సమయంలో మహేష్ కోసం వచ్చిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఈ విషయం గురించి మహేష్ సోదరి మంజుల కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అభిమానులే మారాలి..

అభిమానులే మారాలి..

మహేష్ బాబు ఎక్కువగా వివాదాల్లోకి వెళ్లాడని అందరికి తెలిసిన విషయమే. కానీ తనవరకు ఏదైనా వివాదం వస్తే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తాడు. అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువవ్వడం మహేష్ బాబుకి నచ్చలేదు. అందుకే భరత్ అనే నేను ఈవెంట్ కి ఎన్టీఆర్ ని పిలిపించి హీరోలు చాలా ఫ్రెండ్లిగా ఉంటారని చెప్పకనే చెప్పాడు. ఇక హీరోలందరు బాగానే ఉంటారు అంటూ.. అభిమానులే మారాలని కౌంటర్ ఇచ్చాడు.

అతడు కథ విని..

అతడు కథ విని..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమా మొదట పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ పవన్ ఎందుకో ఆ సినిమా చేయలేదు. అయితే పవన్ కి మొదటి సారి ఆ సినిమా కథ చెబుతుంటే నిద్రపోయాడట. అందుకు కారణం నేనే అని త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో.. సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు. వినసొంపుగా తాను చెప్పే విధానం చూసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిద్రపోయినట్లు త్రివిక్రమ్ చెప్పాడు.

Recommended Video

Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
పవన్, మహేష్ ఇప్పటికి అలానే..

పవన్, మహేష్ ఇప్పటికి అలానే..

జీవితంలో కొన్ని ప్రయాణాలు మనుషుల మధ్య దూరం పెంచుతాయి. ఒకప్పుడు పవన్, మహేష్ బాబు రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇద్దరు హీరోలు బిజీగా మారారు. పవన్ రాజకీయాల్లో.. మహేష్ బిగ్ బడ్జెట్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మాత్రం ఎప్పటిలానే మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X