మనసు దోచేసిన అకిరా నందన్.. మంచి పనితో పెదనాన్న చిరంజీవి బాటలో!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొంతమంది వారసులు రెడీ అవుతున్నారు. అయితే ఎవరు వచ్చినా రాకపోయినా మాత్రం అందరి ఫోకస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దకుమారుడు అకిరా నందన్ పైనే ఉంది. అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు.

అకిరా నందన్ ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకిరాకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఒక మంచి పని తో అకిరా నందన్ మెగా అభిమానుల మనసులు దోచేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

 హీరోగా ఎంట్రీ ఇస్తే..

హీరోగా ఎంట్రీ ఇస్తే..

ఈనెల 8వ తేదీన 18వ వసంతంలోకి అడుగు పెట్టిన అకిరా నందన్ ఒక్కసారిగా జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇప్పటికే మెగా హీరోలలో అందరి కంటే ఎక్కువ హాట్ కలిగి ఉన్నా అకిరానందన్ కు 18 ఏళ్లు నిండాయి కాబట్టి హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం అయితే..

ప్రస్తుతం అయితే..

అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే అకిరాకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన కూడా లేదు అని అతని తల్లి రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఇక అకిరా కు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

సినిమాల గురించి..

సినిమాల గురించి..

ఇక అకిరానందన్ తండ్రికి తగ్గట్టుగా చాలా నిబద్ధతతో ముందుకు సాగేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను కూడా సామాజిక అంశాల విషయంలో చాలా మంచి అవగాహన పెంచుకుంటూ ఉన్నాడు అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ తెలియజేసింది. అకిరా నందన్ ఎప్పుడు కూడా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి మాట్లాడడం తాను చూడలేదు అని కూడా ఆమె వివరణ ఇచ్చింది.

మొదటిసారి రక్తదానం

మొదటిసారి రక్తదానం

అయితే అకిరా నందన్ ఎదుగుదలను చూస్తూ ఉంటే అతను తన తండ్రి అలాగే పెదనాన్న తరహాలోనే అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అకిరా నందన్ మొదటి సారి రక్త దానం చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఎంతోమంది అభిమానులు యువ హీరోలు రక్తదానం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక మొదటి సారి అకిరానందన్ కూడా అదే తరహాలో అడుగులు వేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అందులో ఎలాంటి నిజం లేదని..

అందులో ఎలాంటి నిజం లేదని..

ఇక అకిరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అనే విషయం మెగా అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. ప్రస్తుతం అయితే అకీరానందన్ పూర్తిగా స్టడీస్ పైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో అతను ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని కూడా తల్లి రేణుదేశాయ్ ఇటీవల అఖిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X