జనాల్లో కలిసిపోయి దైవదర్శనం చేసుకున్న పవన్ కొడుకు అకిరా నందన్.. ఎంత చెప్పినా వినకుండా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల తనయులపై ఫోకస్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారి వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అంటే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. సోషల్ మీడియా ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా నటవారసులకు ఫ్యాన్స్ గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. ఇక జూనియర్ పవర్ స్టార్ పై కూడా అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇటీవల గుడిలో అతను దర్శనం చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అందరి చూపు అతని వైపే..

అందరి చూపు అతని వైపే..

టాలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ లో రాబోయే వారసుల లిస్ట్ పెద్దగానే ఉంది. ముఖ్యంగా అందరూ అకిరా నందన్ వైపే ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు. అతని వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ డెబ్యూ పై రూమర్స్ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే 17ఏళ్ళ వయసులోకి వచ్చిన అకిరా హైట్ తోనే షాక్ ఇస్తున్నాడు. అతను వరుణ్ తేజ్ కంటే ఎక్కువ హైట్ తో ఉన్నాడు.

పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా

పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా

అకిరాకు సంబంధించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిహారిక పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ ఇచ్చిన స్టిల్ లో అందరికంటే ఎక్కువ హైట్ తో కనిపించిన అకిరా నందన్ అభిమానుల మనసును దోచేసుకున్నాడు.

జనాల్లో కలిసిపోయి

జనాల్లో కలిసిపోయి

ఇక చాలా రోజుల తరువాత అకిరా బెంగుళూరు నుంచి ఆంద్రప్రదేశ్ కు వచ్చాడు. ఎవరు ఊహించని విధంగా ఉదయం తిరుపలలో సాధారణ భక్తుల లైన్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఎవరైనా స్టార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు వస్తే స్పెషల్ గా విఐపి దర్శనంతో ముందు వెనుక ఎవరు లేకుండా చూసుకుంటారు. కానీ అకిరా మాత్రం సింపుల్ గా జనాల్లో కలిసిపోయి దేవుడు దర్శనం చేసుకున్నారు.

 వాళ్ళను ఎవరు గుర్తు పట్టలేదు

వాళ్ళను ఎవరు గుర్తు పట్టలేదు

రేణు దేశాయ్ కూతురు ఆధ్య కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు. మొహానికి మాస్క్ వేసుకోవడంతో మొదట వాళ్ళను ఎవరు గుర్తు పట్టలేదు.. కానీ అకిరా హైట్ చూసి మీడియా సభ్యులు వెంటనే గుర్తు పెట్టేశారు. ముఖ ద్వారం నుంచి బయటకి వచ్చే క్రమంలో ఫొటోలు తీయడంతో అందరికి అర్థమయ్యింది.

ఎంత చెప్పినా కూడా..

ఎంత చెప్పినా కూడా..

ఇక ప్రొటోగ్రాఫర్స్ ఫొటోలు కోసం మాస్క్ తీయమని ఎంత అడిగినా కూడా అకిరా నందన్ సిగ్గు పడుతూ తియ్యలేదు. తల్లి రేణు దేశాయ్ ఎంత చెప్పినా కూడా తియ్యలేదు. సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక అధ్య, రేణు దేశాయ్ మాత్రం మాస్క్ లు తీసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X