కొడుకు అకీరా గురించి పవన్‌పై రేణు దేశాయ్ ఒత్తిడి?
హైదరాబాద్: వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం ఉండదని, కొత్తవాళ్లు కూడా పరిశ్రమలోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఓ ఫంక్షన్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నపుడే కొడుకు అకీరాను సినిమా రంగానికి పరిచయం చేయాలని, భవిష్యత్ స్టార్‌గా తీర్చి దిద్దాలని ఆశ పడుతోంది.
ఈ మేరకు ఆమె పవన్ కళ్యాణ్‌పై ఇత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్-2 చిత్రంలో ఏదో ఒక పాత్ర ద్వారా అకీరాను తెలుగు సినిమా ప్రవేశం చేయించాలని పవన్ కళ్యాణ్‌ను కోరుతుందట. మరి రేణుదేశాయ్ కోరికను పవన్ తీరుస్తాడా? అకీరా నందన్ సినీ భవిష్యత్‌కు తన గబ్బర్ సింగ్ 2 సినిమా ద్వారా బాటలు వేస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

గబ్బర్ సింగ్ -2 సినిమా విషయానికొస్తే ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్లో హడావుడి లేకుండా సాగింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల బాట పట్టిన కారణంగా ఈ చిత్రం షూటింగ్ లేటవుతోంది.
మరో వైపు బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'దేవ దేవం భజే' టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు వార్తలు వనిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











