నాని సినిమా కోసం రాబోతున్న పవన్ కళ్యాణ్.. ఎవరు పిలిచారంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ప్రతి వారం ఒక విభిన్నమైన సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే F 3 సినిమా అలాగే మేజర్ సినిమాతో పాటు కమల్ హాసన్ విక్రమ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు నాని కూడా అంటే సుందరినికి అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు గా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ని ఎందుకు పిలిచారు? ఎవరు పిలిచారు? అనే వివరాల్లోకి వెళితే..

మధ్యలో ఆఫర్స్ వచ్చినా..?

మధ్యలో ఆఫర్స్ వచ్చినా..?

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత ఒక విభిన్నమైన కామెడీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అప్పుడెప్పుడో బలే బలే మగాడివోయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న నాని మళ్ళీ ఆ తర్వాత అలాంటి కామెడీ సినిమా చేయలేకపోయాడు. మధ్యలో కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికి కూడా పూర్తిస్థాయిలో నమ్మకంగా లేకపోవడంతో వాటితో రిస్క్ చేయలేదు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన 'అంటే సుందరానికి' సినిమా పై నాన్న అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

నాని కోసమే..

నాని కోసమే..

బ్రోచేవారెవరురా సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వివేక్ ఆత్రేయ ఆ తర్వాత ప్రత్యేకంగా నాని కోసమే ఈ కథను రెడీ చేసినట్లు గా చెప్పాడు. నాని కంటే ముందు కొంత మంది హీరోలకు ఈ కథ మేయిన్ స్టోరీ లైన్ చెప్పినప్పటికీ ఆ తర్వాత నాని కోసం ప్రత్యేకంగా మళ్లీ స్క్రిప్ట్ పై రివర్క్ చేసినట్లుగా కూడా వివరణ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

గ్రాండ్ గా ఈవెంట్

గ్రాండ్ గా ఈవెంట్

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతో నాని సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. గురువారం రోజు శిల్పకళావేదికలో జరగబోతున్న అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా వేడుకల్లో సందడి చేయబోతున్నారు.

 ముఖ్య అతిథిగా పవన్

ముఖ్య అతిథిగా పవన్

అయితే ఈ వేడుక కోసం ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారి ప్రొడక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు నాని సినిమా కోసం కూడా పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

క్లారిటీ ఇచ్చిన నాని

క్లారిటీ ఇచ్చిన నాని

మైత్రి మూవీ మేకర్స్ అయితే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని అంత బిజీగా ఉన్నాడు. పలు రాజకీయ అంశాలతో పవన్ కళ్యాణ్ గత రెండు మూడు వారాలుగా తిరిగి లేకుండా జనసేన అధినేత తో చర్చలు జరుపుతున్నాడు. ఇక.పవన్ అయితే రాబోతున్నట్లు నాని కూడా ట్వీట్ చేశాడు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X