అభిమానుల కోసం మోకాళ్ళపై పవన్ కళ్యాణ్.. ఇందుకే కదా ఆయనంటే అంత ఇష్టం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే అత్యదిక అభిమానులు ఉన్న హీరో అని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక విధంగా సినిమాలకంటే కూడా తన సింపుల్ లైఫ్ తోనే జనాలకు చాలా దగ్గరయ్యాడు. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎందుకంత ఇష్టపడతారు అనే విషయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఇటీవల ఒక చిన్న ఫొటో కూడా మరొక ఉదాహరణ అని చెప్పవచ్చు.

ఆయనకు హీరోలు కూడా అభిమానులే

ఆయనకు హీరోలు కూడా అభిమానులే

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత గౌరవాన్ని ఇస్తారో స్పెషల్ గా చెప్పనవసరం. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ అగ్ర తారలు కూడా చాలా సార్లు ఆశ్చర్యపోయారు. ఇక చాల వరకు యువ హీరోలు ఇంకా ఆయనే పేవరేట్ హీరో అన్నట్లుగా అభిమానిస్తారు. ఆ లిస్టులో నితిన్, నిఖీల్ లాంటి యువ హీరోలు చాలా మందే ఉన్నారు.

ఫొటో ఇచ్చే వరకు వెళ్లడం లేదు..

ఫొటో ఇచ్చే వరకు వెళ్లడం లేదు..

ఇక అభిమానులు ఎప్పుడు ఫొటో దిగడానికి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కొంచెం కూడా అసహనం వ్యక్తం చేయడు. వీలైనంత వరకు సింపుల్ గా ఫొటోలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా వకీల్ సాబ్ షూటింగ్ కు చాలా మంది అభిమానులు వచ్చారు. ఫొటో ఇచ్చే వరకు కూడా కొంతమంది లొకేషన్స్ నుంచి వెళ్లిపోవడం లేదు.

అభిమానుల కోసం.. మోకాళ్ళపై కూర్చున్న పవన్

అభిమానుల కోసం.. మోకాళ్ళపై కూర్చున్న పవన్

అయితే ఇటీవల చాలా సేపు తన కోసం ఎదురుచూసిన అభిమానులకు పవన్ కళ్యాణ్ చూపించిన ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందరికి ఒక ఫొటో ఇవ్వడం కోసం తను మోకాళ్ళపై కూర్చున్నాడు. నవ్వుతూ ఫొటో ఇచ్చిన పవన్ అందరిని ఆప్యాయంగా పలకరించి పంపించాడు. ఆ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

F3 Movie Launched With Pooja Ceremony
వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడంటే..?

వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడంటే..?

ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ఇప్పుడు ఆభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X