Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం హై వోల్టేజ్ యాక్షన్.. ఇలా సిద్దమవుతున్న పవన్.. ఫొటోస్ వైరల్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథతో వస్తుండడంతో అభిమానులు అంచనాలు స్థాయి అమాంతంగా పెరిగిపోయాయి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా డిఫరెంట్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిమ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాకోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ముందుగానే శిక్షణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ట్రైనర్స్ తో కలిసి ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని షూటింగ్ లోకి వెళుతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటిసారి..

మొదటిసారి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మొదటి సారి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాను చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుందని కూడా అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

హరిహర వీరమల్లు కోసం..

హరిహర వీరమల్లు కోసం..

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా ఏ పాత్ర కోసం కూడా తన ఫిట్నెస్ విషయంలో పెద్దగా మార్పులు అయితే చేయలేదు. కానీ హరిహర వీర మల్లు కోసం మొదటి సారి పవన్ కళ్యాణ్ దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తన ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయని పవన్ సరికొత్తగా మార్చుకున్నాడు.

ప్రత్యేకంగా శిక్షణ

ప్రత్యేకంగా శిక్షణ

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ ఉండటం విశేషం. త్వరలో మొదలు కాబోతున్న ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ నిపుణులతో కలిసి ప్రత్యేకంగా వర్క్ షాప్ లో పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Recommended Video

Pawan Kalyan హై వోల్టేజ్ యాక్షన్.. Hari Hara Veera Mallu | Filmibeat Telugu
మార్షల్ ఆర్ట్స్ కోసం...

మార్షల్ ఆర్ట్స్ కోసం...

సినిమాలో సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయట. అయితే ఇందులో మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన కొన్ని ఫైట్స్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే న్యూజిలాండ్ కు చెందిన ఒక ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడితో కలిసి పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మంచి థ్రిల్ ఇచ్చేలా..

మంచి థ్రిల్ ఇచ్చేలా..

రీసెంట్ గా ఈ చిత్ర యూనిట్ సభ్యులు పవన్ కళ్యాణ్ శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను కూడా సోషల్ మీడియా లో విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అనేలా ఒక ఆయుధాన్ని పట్టుకొని కనిపిస్తున్నాడు. చూస్తుంటే సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి థ్రిల్ ఇచ్చేలా ఉన్నాడు అనిపిస్తోంది.

విడుదల ఎప్పుడంటే?

విడుదల ఎప్పుడంటే?

ఇక పవన్ వీరమల్లు సినిమా షూటింగ్ అయితే ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి సినిమాను సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అసలైతే ఏప్రిల్ 29వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇతర కారణాల వలన షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్లీ వాయిదా వేయక తప్పలేదు.

వీలైతే దసరా సమయంలో రిలీజ్ చేయవచ్చని టాక్. ఇక 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X