twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. చాలా సంతోషంగా ఉందంటూ

    |

    ఇద్దరు అగ్ర హీరోలు కలిస్తే అభిమానులు ఎంతగా సంతోషిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు ఒకరిపై మరొకరు స్పందిస్తే కూడా ఆ కిక్కు మామూలుగా ఉండదు. హీరోలు ఎంత సంతోషిస్తారో గాని అభిమానులు మాత్రం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. పవన్, మహేష్ కలయికపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మహేష్ కు పవన్ విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

    ఎప్పుడైనా ఎదురుపడితే

    ఎప్పుడైనా ఎదురుపడితే

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఒకరి పనుల్లో మరొకరు బిజీగా ఉండడం వలన కలుసుకోవడం కుదరడం లేదు గాని.. ఎప్పుడైనా ఎదురుపడితే మాత్రం ఇద్దరు స్టార్స్ కూడా చాలా ఫ్రెండ్లిగా మాట్లాడుకుంటారు. ఇండస్ట్రీలో హీరోలుగా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళకు మంచి సాన్నిహిత్యం అయితే ఉంది.

    అప్పటి నుంచే..

    అప్పటి నుంచే..


    జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో అందరిని ఎట్రాక్ట్ చేసింది. అంతకు ముందే పవన్ పైరసీకి అడ్డుకట్ట వేసే విషయంలో మహేష్ బాబుతో కలిసి అడుగులు వేశారు. అర్జున్ సినిమా సమయంలో మహేష్ బాబు పిలుపుకు స్పందించిన మొదటి టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్. అప్పటి నుంచే ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది.

    ఒకరిపై మరొకరు స్పందిస్తే..

    ఒకరిపై మరొకరు స్పందిస్తే..


    సందర్బం వస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి హీరోకైనా కూడా తన సైడ్ నుంచి విషెస్ అందేలా చూసుకుంటారు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ నటుడి విషయంలో ఆయన విషెస్ అందిస్తే సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో మహేష్ బాబు పవన్ కు బర్త్ డే విషెస్ అంధించగా అది సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కూడా దానికి బదులుగా మరో ట్వీట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసిన విషయం తెలిసిందే.

    మహర్షి సినిమాకు అవార్డు రావడంతో

    మహర్షి సినిమాకు అవార్డు రావడంతో

    ఇక ఇటీవల మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ప్రేస్ నోట్ ద్వారా విషెస్ అందించారు. మహర్షి అత్యదిక ప్రజాదరణ పొందిన సినిమాగా జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ మహర్షి సినిమాకు పని చేసిన వారికి అలాగే మహేష్ బాబుకు కూడా చాలా సంతోషంగా ఉందంటూ తన బెస్ట్ విషెస్ అంధించారు. అలాగే బెస్ట్ తెలుగు మూవీగా జెర్సీకి అవార్డు రావడంతో నానికి చిత్ర దర్శక నిర్మాతలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

    Recommended Video

    Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్

    English summary
    67th National Film Awards awards will be announced on March 22nd. 7 Malayalam movies nominted in for this year. Mohanlal's movie is special attraction for this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X