»   » ఆ విషయం చెప్పకపోతే నేను తప్పుచేసినట్లే (పవన్ స్పీచ్)

ఆ విషయం చెప్పకపోతే నేను తప్పుచేసినట్లే (పవన్ స్పీచ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుక సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఎప్పుడూ రెండు ముక్కలకంటే ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చివర్లో సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు.

ఆయన ఓ ఆసక్తకర విషయం వెల్లడిస్తూ....సభా ముఖంగా ఓ విషయం ఇక్కడ చెప్పకపోతే తప్పు చేసిన వాన్ని అవుతాను. నేను దర్శకత్వం వహించిన జాని సినిమా ప్లాపు తర్వాత కాస్త మూడౌట్లో ఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. తొలిసారిగా ఆయన కథ చెబుతుంటే నిద్ర పోయాను.

కానీ ఆయన ఏమాత్రం బాధ పడకుండా మళ్లీ జల్సా కథతో వచ్చారు. నేను మీలాంటి మనిషినే. నాకు బాధలు ఉంటాయి. జల్సా చేస్తున్న సమయంలో నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు త్రివిక్రమ్ నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి. ఆయన నాకు ఎంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో పవన్ చెప్పిన మరిన్ని వివరాలు...

అభిమానుల గురించి మాట్లాడుతూ...

అభిమానుల గురించి మాట్లాడుతూ...

ఇక్కడకు వచ్చిన నా ఆత్మీయులందరికీ పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీతో కూడా అనుబంధాన్ని నేను కూడా అలాగే ఫీలవుతాను. మీ అభిమానం వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు.

ఇలాంటి ఆడియో ఫంక్షన్లంటే నచ్చదు

ఇలాంటి ఆడియో ఫంక్షన్లంటే నచ్చదు

నాకు ఇలాంటి ఆడియో ఫంక్షన్లంటే నచ్చదు. ఒక రకంగా ఇబ్బంది పడతాను. ఈ పంక్షన్లకు రావాలనుకునే వారు ఎక్కువ ఉంటారు. కానీ అందరికీ ఇక్కడ చోటు ఉండదు. మందిని కుదించుకని ఇలాంటి వేడుకలు జరుపుకోవాలి. వీలైనంత వరకు కుదిరితే ఇలాంటివి మానేయడానికే ట్రై చేస్తారు. సినిమాల వల్ల ఒక్కోసారి చేయక తప్పడం లేదు. ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు నన్ను తీసుకొచ్చి గన్ పాయింట్ ముందు తీసుకొచ్చినట్లు ఫీలవుతాను అని చెప్పుకొచ్చారు.

ప్రతి రోజూ కొత్తగానే భావిస్తాను

ప్రతి రోజూ కొత్తగానే భావిస్తాను

నేను షూటింగుకు వెళ్లే ప్రతిరోజూ కొత్తగానే భావిస్తాను. కాస్త భయంగానూ ఉంటుంది. షూటింగులకు వెళ్లి దర్శకులు చెప్పింది చేయడం తప్ప నాకు ఏమీ తెలియదు. నాకు ఎంతో మంది సన్నిహితులు. అభిమానులుగా కాకుండా మిత్రులుగా చూస్తాను అన్నారు.

అలీ నాకు గుండె కాయలాంటి వాడు

అలీ నాకు గుండె కాయలాంటి వాడు

కమెడియన్ అలీతో పవన్ కళ్యాణ్‌కు ఉన్న అనుబంధం ఏమిటో మరోసారి రుజువైంది. పవన్ మాట్లాడుతూ...అలీ నాకు గుండె కాయలాంటివాడు. అలీ లేకుండా నా సినిమా ఉండదు. అలీకి డాక్టరేట్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. సభా ముఖంగా అలీకి మరోసారి విషెస్ చెప్పండి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సమంత, ఇతర ఆర్టిస్టుల గురించి...

సమంత, ఇతర ఆర్టిస్టుల గురించి...

సమంత గురించి పవన్ మాట్లాడుతూ....ఆమె చాలా ప్రొఫెషనల్. చాలా క్రమశిక్షణతో ఉంటుంది. అలాంటి ఆర్టిస్టుతో పని చేయడం హ్యాపీగా ఉంది. సినిమాకు అంతా కష్ట పడి పని చేసారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాన్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

బ్రహ్మానందం గురించి పవన్ చెప్పిన వివరాలు

బ్రహ్మానందం గురించి పవన్ చెప్పిన వివరాలు

నాకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో బ్రహ్మానందం ఒకరు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆప్పుడు ఆయన తరచూ మా ఇంటికి వస్తుండే వారు. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది అన్నారు పవర్ స్టార్.

 బ్రహ్మానందం మాట్లాడుతూ..

బ్రహ్మానందం మాట్లాడుతూ..

సినిమాలో ఓ అద్భుతమైన సాంగ్ ఉంది. అది ఎందుకో ఇప్పుడు విడుదల చేయలేదు. తర్వాత విడుదల చేస్తారేమో? ఆ సాంగు గురించి ఇప్పుడే చెబితే నన్ను పాతేస్తారేమో అని బ్రహ్మీ వ్యాఖ్యానించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన డైలాగులు రాసారని తెలిపారు.

నదియా మాట్లాడుతూ....

నదియా మాట్లాడుతూ....

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సినిమాకు అంతా కష్టపడి పని చేసారు. సినిమా మంచి సక్సెష్ అవుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు. సమంత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో పని చేయడంపై ఆనందం వ్యక్తం చేసారు.

English summary
Pawan Kalyan speech at 'Attarintiki Daredi' audio launch. He has done an unthinkable at the audio release of 'Attarintiki Daredi' audio launch today. He went a step ahead and roared a dialogue from 'Attarintiki Daredi'. Pawan uttered the exciting power packed dialogue that is part of trailer, in style, on stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu