‘నా పేరు సూర్య’ థాంక్యూ ఇండియా మీట్: బన్నీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

By Bojja Kumar

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' థాంక్యూ మీట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ రాకతో థాంక్యూ మీట్ మరింత జోష్‌గా మారింది. భారీ సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంటరవ్వగానే పవర్ స్టార్ నినాదాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు.

 పవన్ కళ్యాణ్ స్పీచ్

పవన్ కళ్యాణ్ స్పీచ్

‘నా పేరు సూర్య' సినిమా ట్రైలర్ చూడగానే.... సినిమా చూడాలనే కోరిక కలిగింది. త్వరలోనే సినిమా చూపించాలని నిర్మాత లగడపాటి శ్రీధర్ గారికి చెప్పాను. నేను మరో పర్యటనకు వెళ్లేలోపు తప్పకుండా సినిమా చూస్తాను. వక్కంతం వంశీ దర్శకుడిగా కంటే రచయితగా బాగా తెలుసు. కొమురంపులి సినిమా సమయంలో ఒక కథ చెప్పారు. దాన్ని అపుడు ముందుకు తీసుకెళ్లలేక పోయాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో

అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో

దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన వంశీ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో విజయవంతమైన సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. గతంలో ఇద్దరం ఒకే చోట ఉండేవారం. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో నిర్మాత వాసుగారికి శుభాకాంక్షలు... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 అన్నయ్య నిర్మాత అని తెలియదు

అన్నయ్య నిర్మాత అని తెలియదు

ఇక్కడికి వచ్చే వరకు మా అన్నయ్య నాగబాబు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అనే విషయం నాకు తెలియదు. తను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను అని ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే మేము ఇవన్నీ మాట్లాడుకోము. ఈ సినిమాకు ఆయన నిర్మాత అని నాకు ఇప్పుడే తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 ఆర్య మూవీ నాకు బాగా ఇష్టం

ఆర్య మూవీ నాకు బాగా ఇష్టం

బన్నీ హీరోగా వచ్చిన ‘ఆర్య' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ తర్వాత ‘దేశ ముదురు', ఇంకా మిగతా సినిమాలు చూసినపుడు తన ఎదుగుదల చాలా ఆనందం అనిపించింది. మున్ముందు అల్లు అర్జున్ మంచి సినిమాలు చేయాలి. ఆయన చేసే సినిమాలు గొప్ప విజయం సాధించాలి... అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

 అల్లు అర్జున్ మరింత పైకి ఎదగాలి

అల్లు అర్జున్ మరింత పైకి ఎదగాలి

అల్లు అర్జున్ ఆయన తల్లిదండ్రులకు, వారి తాతగారికి, అభిమానులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమాను ఈ సమ్మర్ ల్లో వచ్చినందుకు సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

 అది బెస్ట్ కాంప్లిమెంట్స్: అల్లు అర్జున్

అది బెస్ట్ కాంప్లిమెంట్స్: అల్లు అర్జున్

అల్లు అర్జున్ మాట్లాడుతూ ``నా పేరు అల్లు అర్జున్‌. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్ష‌న్ పేరు థాంక్యూ ఇండియా. అందులో తొలి థాంక్యూ మా ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌గారికి, ప‌వ‌ర్‌స్టార్ అభిమానులకు. నాకు ఆర్మీలాగా నిలుచునే అభిమానుల‌కి. ఈ సినిమా గురించి నాకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ లో ఒక‌టి మీతో పంచుకుంటాను. `సినిమా చూశాం . చాలా బావుంది ఈ సినిమా. మా పిల్ల‌లు మిలిట‌రీ యూనిఫార్మ్ కుట్టించుకోవాల‌నుకుంటున్నారు. సినిమా పూర్త‌య్యాక దాన్ని చూశాక పిల్ల‌లు ఎవ‌రైనా హెయిర్‌స్టైల్స్, బ్యాగ్‌లు కావాల‌ని అడుగుతారు. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత పిల్ల‌లు మిలిట‌రీ కాస్ట్యూమ్స్ కుట్టించుకుంటున్నారు` అని చాలా మంది త‌ల్లులు, మ‌హిళ‌లు నాతో చెప్పారు. అది విని చాలా ఆనందించాను`` అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X