‘రంగస్థలం’ ఆస్కార్‌కు పంపకపోతే ద్రోహం చేసినట్లే: పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ స్పీచ్

By Bojja Kumar

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా విజయోత్సవ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రామ్ చరణ్, సుకుమార్, చిత్ర బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. రంగస్థలం తెలుగు జాతి గర్వపడే సినిమా, ఇది మన మట్టి కథ అని ప్రశంసించారు. మనం అంతా కలిసి ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపక పోతే ద్రోహం చేసిన వారం అవుతామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Recommended Video

Rangasthalam Success Meet : Pawan Kalyan Emotional Speech
 రంగస్థలం విజయోత్సవ ధ్వనులు అవి

రంగస్థలం విజయోత్సవ ధ్వనులు అవి

పవన్ కళ్యాణ్ తన స్పీచ్ మొదలు పెట్టగానే.... బాణాసంచా శబ్దం మొదలైంది. దీనికి ఆయన స్పందిస్తూ.... అది రంగస్థలం విజయోత్సవ ధ్వనులు. ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలి. ఉత్తేజం కలిగించే రికార్డులు మరిన్ని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను... అన్నారు.

తెలుగు ప్రేక్షకులు గర్వించే సినిమా

తెలుగు ప్రేక్షకులు గర్వించే సినిమా

రంగస్థలం సినిమా అత్యంత అద్భుతమైన విజయం సాధించి అనేక రికార్డులు బద్దలు కొట్టి కేవలం కలెక్షన్ల పరంగానే కాదు, తెలుగు ప్రేక్షకులకు భారతీయ సినీ చరిత్రలోనే గర్వించే సినిమాను సుకుమార్ తీశారు. ఇలాంటి సినిమా తీయడంలో ఆయనకు అండగా నిలిచిన మైత్రి మూవీస్ వారికి ధన్యవాదలు.... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 చాలా కాలం తర్వాత నాలో కోరిక కలిగింది, ఆ రేటింగ్సే కారణం

చాలా కాలం తర్వాత నాలో కోరిక కలిగింది, ఆ రేటింగ్సే కారణం

నేను ఎప్పుడూ సినిమాల్లో యాక్ట్ చేయడమే కానీ థియేటర్లలో సినిమా చాలా తక్కువగా చూశాను. తొలి ప్రేమ సమయంలో సంధ్య థియేటర్‌కు వెళ్లాను. చాలా రోజుల తర్వాత ‘రంగస్థలం' సినిమా పబ్లిక్‌తో కలిసి చూడాలని మనస్ఫూర్తిగా కోరిక కలిగింది. అందుకు కారణం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే ఆనందం వేసింది. హాలివుడ్ సినిమాలకు మించి రేటింగ్ ఈ చిత్రానికి రేటింగ్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ రేంజిలో ఐఎండిబి వారు కూడా ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. అంత రేటింగ్ ఇవ్వడంతో ఈ సినిమాలో ఏముంది అనే కోరిక నాకు కలిగింది. చూస్తున్నంత సేపు రంగస్థలం సినిమా అనిపించలేదు. జీవితంలా అనిపించింది.... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అపుడు సుకుమార్ వస్తే పట్టించుకోలేదు

అపుడు సుకుమార్ వస్తే పట్టించుకోలేదు

కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... భావి తరాలకు ఒక విలువలతో, వాస్తవితకు దగ్గరగా ఉన్న సినిమా అందించారు. ఇది చాలా మందికి ఇన్స్‌స్పిరేషన్ కలిగించింది. పదేళ్ల క్రితం సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చారు. అపుడు ఆయన ఏదో కథ చెప్పాలనుకున్నారు, నేనేదో మూడ్లో విన్నాను కానీ దానికి స్పందించలేదు. కానీ ఆయన మొదటి సినిమా నుండి నాకు ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న దర్శకుడు. గొప్ప రచయిత. యువతకు కావాల్సిన కాంటెంపరరీ సబ్జెక్ట్ తెలిసిన దర్శకుడు.... అని పవన్ అన్నారు.

రామ్ చరణ్ మీద పవన్ ప్రశంసలు

రామ్ చరణ్ మీద పవన్ ప్రశంసలు

ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అద్భుతమైన పెర్ఫార్మర్ అని ప్రశంసించారు, చరణ్ మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సమంత గారు చాలా అద్భుతంగా చేశారు. రత్నవేలు గారు సినిమాను చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమాటోగ్రాఫర్‌తో చేయాలని నాకు ఎప్పటి నుండో ఉండేది. దేవిశ్రీప్రసాద్ గారంటే చాలా ఇష్టం. చంద్రబోస్ గారి లిరిక్స్ సంగీతానికి ప్రాణం పోశాయి. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

దర్శకుడికి విజన్ ఉంటనే సాధ్యం

దర్శకుడికి విజన్ ఉంటనే సాధ్యం

ఒక సినిమాను ఇలా జీవం ఉట్టిపడేలా చేయాలంటే దర్శకుడికి ఒక విజన్ కావాలి. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ చాలా అద్భుతంగా పని తీరు కనబర్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి వ్యక్తిని బయటకు తీసి మనకు పరిచయం చేసిన డైరెక్టర్ గారికి థాంక్స్. కాస్టూమ్ డిజైనర్స్ సహజత్వం ఉట్టిపడేలా దుస్తులు డిజైన్ చేశారు. ఇవన్నీ దర్శకుడు తన విజన్‌తో చేయడం వల్లే సాధ్యం అయింది అని పవన్ అన్నారు.

 ఇది ఆస్కార్ వెళ్లాల్సిన సినిమా, పంపక పోతే ద్రోహమే

ఇది ఆస్కార్ వెళ్లాల్సిన సినిమా, పంపక పోతే ద్రోహమే

‘రంగస్థలం' ఆస్కార్ వెళ్లాల్సిన సినిమా. దక్షిణ భారతం, ఉత్తర భారతం ఒక లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాను ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ చేసి లాస్‌ఏంజెలెస్‌కు పంపించక పోతే ద్రోహం చేసిన వారం అవుతాం. ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయిస్తే భారత దేశం ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వెళుతుంది. ఆ మధ్య దంగల్ సినిమాను కూడా నేను ట్వీట్ చేశాను. ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే అది మన నేలలో కథ. అదే విధంగా రంగస్థలం మన మట్టి కథ, మన తెలుగు నేల కథ, ఈ కథలో మన పౌరుషాలు, మన పంతాలు, మన గొడవలు ఉన్నాయి.... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

నేను ఫెయిలయ్యాను, ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు

నేను ఫెయిలయ్యాను, ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు

అట్టహాసాలకంటే నిజమైన కంటెంటు, మన దైన వాస్తవికతతో కూడిన సినిమా తీయడం చాలా కష్టం. కథలు రాసి ఫెయిలైన వ్యక్తిని నేను, ఆకష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఒక కథను రాసి దాన్ని ప్రేక్షకుల చేత ఒప్పించి సుకుమార్ చాలా గొప్పగా చేశారు. ఇలాంటి గొప్ప కథను తెలుగు జాతికి ఇచ్చినందుకు మీకు ఈ జాతి రుణపడి ఉంటుంది. ఒక మ్యాథమాటికల్ లెక్చరర్ లో ఇలాంటి ప్రతిభ దాగి ఉంటుందని మనకు తెలియదు. ఆయన్ను చూసి రేపు ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తారు... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

బాహుబలికి అండగా నిలిచినట్లే రంగస్థలానికి అండగా ఉండాలి

బాహుబలికి అండగా నిలిచినట్లే రంగస్థలానికి అండగా ఉండాలి

రెండేళ్ల క్రితం బాహుబలికి అందరూ ఎలా అండగా నిలబడ్డారో... రంగస్థలం సినిమాకు అలాగే నిలబడాలి. వర్గాలకు అతీతంగా తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా అండగా నిలబడాలి. రాజకీయాల పరంగా వేరు వేరు వర్గాలు ఉండొచ్చు. వేరు వేరు పరిస్థితులు ఉండొచ్చు. సినిమా పరంగా తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఒక్కటే... అని పవన్ వ్యాఖ్యానించారు.

 ఇది స్టైల్ స్టేట్మెంట్ కాదు

ఇది స్టైల్ స్టేట్మెంట్ కాదు

ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కళ్లజోడు పెట్టుకుని వచ్చాడు. అయితే తాను స్టైల్ కోసం ఇవి పెట్టుకోలేదని, ఎక్కువ కాంతిని నా కళ్లు తీసుకోలేక పోతున్నాయి. ఆ సమస్య ఉండటం వల్లే తప్ప ఇది స్టైల్ స్టేట్మెంట్ ఎంత మాత్రం కాదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X