షూటర్‌కు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. షూటింగ్ క్రీడాకారిణికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. రైఫిల్ షూటింగును ఇష్టపడే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తన ప్రతి సినిమాలోనూ తుపాకి పట్టుకునే సీన్లు తప్పకుండా ఉండేలా చూసుకుంటాడు పవర్ స్టార్. తుపాకులపై ఉన్న మోజే కాబోలు ఆయన్ని ఓ క్రీడాకారిణికి సహాయం చేసేలా చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ 50 మీటర్ల రైఫిల్ షూటింగ్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగులో ఇండియాలోనే టాప్ 15లో చోటు దక్కించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించింది అనంతపురం వాసి రేఖ. వచ్చే ఒలంపిక్స్‌లో పాల్గొనాలనేది ఆమె గోల్. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సహాయం అందించి పోత్సహించారు. ఈ రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ స్పాట్లో రేఖ పవన్ ను కలవగా వెంటనే పవర్ స్టార్ స్పందించారు.
ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ నన్ను ప్రొత్సహించి ఆర్థిక సహాయం అందించడమేకాక మనో ధైర్యాన్ని నింపారని, ఆయన మాటలు నాలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మరింత పెంచాయి. ఇన్నాళ్లు ఆయనలో హీరోను మాత్రమే చూశాను...ఈ రోజు ఆయనలోని మహోన్నత వ్యక్తి చూశాను అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో జరుగుతోంది. రేఖ నేరుగా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి పవన్‍ని కలుసుకున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా, డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












