పవన్ 'జంధ్యం' ధరించారా?: త్రివిక్రమ్ ఉపదేశం వల్లేనా!..
Recommended Video

త్రివిక్రమ్ సహవాసం పవన్ కల్యాణ్‌ను బాగానే ప్రభావితం చేసిందని చెప్పాలి. ఆలోచనల పరంగానే కాదు.. ఆధ్యాత్మికంగానూ ఈ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో పవన్ దైవారాధనకు ఎక్కువ దగ్గరవడమే కాకుండా.. బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై కూడా మక్కువ కనబరుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ 'జంధ్యం' ధరించినట్లుగా ఓ వార్త తెర పైకి రావడం గమనార్హం.

ఆ సీన్‌లో..:
అజ్ఞాతవాసి సినిమాలో ఆఫీస్ ఎపిసోడ్స్‌లో భాగంగా వచ్చే.. జనరల్ బాడీ మీటింగ్ సన్నివేశం ఈ 'జంధ్యం' ప్రచారానికి ఊతమిచ్చిందంటున్నారు. ఆ సన్నివేశంలో పవన్ టీషర్టులో కనిపిస్తారు. ఆ సమయంలో ఆయన షర్ట్ లోపల నుంచి జంధ్యం లీలగా కనిపించిందంటున్నారు.

గతంలోనూ..:
గతంలో గోపాల గోపాల సినిమా సమయంలోనూ పవన్ 'జంధ్యం' టాపిక్ వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న తన అభిమాని ఒకరిని పలకరించడానికి పవన్ వెళ్లారు.
ఆ సందర్భంగా బయటకొచ్చిన ఫోటోల్లో పవన్ ధరించిన కుర్తా లోపల 'జంధ్యం' స్పష్టంగా కనిపించింది. అప్పటినుంచే పవన్ జంధ్యం ధరిస్తున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

త్రివిక్రమ్ సలహాతోనే?:
బ్రాహ్మణులు యజ్ఞోపవీతంగా భావించే జంధ్యం విశిష్టత గురించి త్రివిక్రమ్ పవన్ కల్యాణ్‌కు తెలియజేయడం వల్లే ఆయన దాన్ని ధరించినట్లుగా తెలుస్తోంది. అయితే జంధ్యం వేసుకోవడానికి ఉపనయనం వంటి క్రతువు ఉంటుంది కదా! అనే సందేహం కూడా వస్తోంది. త్రివిక్రమే దగ్గరుండి పవన్ కల్యాణ్‌కు ఉపనయనం కూడా చేయించారా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

త్రివిక్రమ్ ప్రభావం:
సాధారణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల్లోనే జంధ్యం ధరిస్తారు. అయితే పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడే అయినప్పటికీ.. త్రివిక్రమ్ ఉపదేశం మేరకు ఆయన కూడా జంధ్యం ధరించారన్న ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో:
త్రివిక్రమ్‌కు దైవారాధన ఎక్కువ. ఇప్పటికీ ఆయన మూడు సంధ్యలలోనూ సంధ్యా వందనం చేస్తారని అంటారు. ఆధ్యాత్మికంగా నరసింహ అనే గురువు సలహాలను త్రివిక్రమ్ బాగా పాటిస్తారని చెబుతున్నారు. త్రివిక్రమ్ ద్వారా పవన్ కల్యాణ్ కు కూడా ఆయన పరిచయం అయ్యారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











