ప్రభుదేవా దర్శకత్వలో ‘పవన్ కళ్యాణ్’ ??
'3 ఇడియట్స్" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జెమిని ఫిలిం సర్క్యూట్స్ తెలుగు'3 ఇడియట్స్"ను రీమేక్ చేస్తోంది. గతంలో ఇదే సంస్థ 'మున్నాభాయ్ ఎం.బి.బి.యస్", 'లగే రహో మున్నాబాయ్" చిత్రాలను చిరంజీవితో 'శంకర్ దాదా ఎం.బి.బి.యస్", 'శంకర్ దాదా జిందాబాద్" గా రీమేక్ చేసింది. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ లేక మహేష్ బాబు తో '3 ఇడియట్స్" ను రూ. 12కోట్లు వెంచించి రీమేక్ చేసే ఆలోచనలతో జెమిని సంస్థ ఉంది.
3 ఇడియట్స్ ఓరిజినట్ వర్షన్ ను అమీర్ ఖాన్, మాదవన్, షర్మాన్ జోషి మరియు కరీనా ఖపూర్ నటించి బ్లాక్ బస్టర్ చిత్రంగా విజయపంథాలో నడుస్తోన్న విషయం విధితమే. అయితే తెలుగు, తమిళ రీమేక్ కొరకు దర్శకుడిగా ప్రభుదేవా పేరును పరిశీలిస్తోంది. మరి 'ఒక్కడు" హిందీ రీమేక్ తో బిజీగా ఉన్న ప్రభుదేవా యస్ అంటాడో లేదో వేచి చూడాలి.
More from Filmibeat
త్రి ఇడియట్స్ ప్రభుదేవా పవన్ కళ్యాణ్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా ఎంబిబియస్ చిరంజీవి జెమిని ఫిలిం 3idiots prabhudeva pawan kalyan shankar dada zindabad shankar dada mbbs chiranjeevi


Click it and Unblock the Notifications











