Harihara Veeramallu Teaser: కత్తి దూసిన పవన్ కల్యాణ్.. లెక్కలు సరిచేసేలా వీరమల్లు టీజర్

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హై రేంజ్ యాక్షన్‌తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు తమదైన సినిమాలతో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. ఈ టాలీవుడ్ స్టార్ హీరో తొలిసారి ఐదు భాషల్లో నటిస్తోన్న తాజా చిత్రమే 'హరిహర వీరమల్లు'.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న సినిమానే 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రాన్ని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశం అంతగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా పవన్ కల్యాణ్ సినిమాను భారీ రేంజ్‌లో రూపొందిస్తున్నారు.

Pawan Kalyan Starrer Harihara Veeramallu Movie Official Teaser Released

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూట్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు ఆలస్యంగా సాగుతోంది. దీనికితోడు ఎన్నికల వల్ల మరోసారి చాలా లేట్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లను వదులుతోంది. ఇలా ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అందులో మొదటి పార్టుకు సంబంధించిన టీజర్‌ను 'Sword vs Spirit' అనే పేరుతో కాసేపటి క్రితమే వదిలారు. ఇందులో సినిమా నేపథ్యాన్ని, హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ ఎలివేషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్‌తో కత్తి యుద్దాలు చేయించారు.

తాజాగా విడుదలైన 'హరిహర వీరమల్లు' టీజర్‌లో పవన్ కల్యాణ్ తొలిసారి దొరలను దోచుకునే దొంగలా కనిపించాడు. ప్రజల సొమ్మును పెద్ద వాళ్లు దోచుకుంటుంటే.. వాళ్లను దోచుకుని లెక్కలు సరిచేసే వ్యక్తిగా అతడు కనిపించబోతున్నాడు. మొత్తంగా ఇందులో యాక్షన్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. పవన్ లుక్స్ హైలైట్‌గా ఉన్నాయి. దీంతో ఈ టీజర్ కాసేపట్లోనే తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సహాయం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X